భారతదేశంలో పెట్టుబడులను ఆవహ్వానించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ముందుంటాడు. ఆయన ప్రపంచ వేదికలపై ఎక్కడ మాట్లాడినా కూడా భారతదేశంలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలో...భారతీయ మార్కెట్ ఎంత పెద్దదో వివరిస్తూ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారతదేశం ఎంత పురోగతిని సాధించిందో చూపిస్తారు. 

విదేశాల్లో ఉన్నా, స్వదేశంలో ఉన్నా అది హౌడీ మోడీ అయినా లేదా స్వదేశీ వేదికైనా వ్యాపారవేత్తలను ఖచ్చితంగా కలుస్తారు. వారికోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తారు. అలాంటి ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకో ప్రపంచ అపర కుబేరుడు అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ని మాత్రం కలవడం లేదు. 

జెఫ్ ప్రస్తుతం మూడు రోజుల పర్యటన నిమిత్తం భారతదేశంలో పర్యటిస్తున్నారు. అమెజాన్ ఇండియా ఈవెంట్ సంభవ్ లో పాల్గొనేందుకు జెఫ్ భారత్ దేశం వచ్చాడు. వచ్చినప్పటి నుండి భారతదేశంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. 

Also read; అమ్మాయిలను ఎర వేస్తున్నారు: మోడీ షాకింగ్ కామెంట్స్

21వ శతాబ్దం భారతదేశానిదే అంటూ కీర్తిస్తున్నాడు కూడా. సంక్రాంతి పర్వదినం సందర్భంగా పిల్లలతో కలిసి ఆనందంగా గడుపుతూ పతంగులు కూడా ఎగరేశారు. 

అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ మాత్రం దొరకలేదు. దీనికి ప్రభుత్వం మాత్రం మోడీ షెడ్యూల్ బిజీగా ఉండడం వల్ల కలవడం కుదరడం లేదు అని చెబుతున్నప్పటికీ కూడా అసలు కారణం మాత్రం వేరేది ఉంది. 

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం జెఫ్ బెజోస్ కు చెందిన వాషింగ్టన్ పోస్టు పత్రిక వ్యాసాలపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. వాషింగ్టన్ పోస్టు భారతదేశ ప్రభుత్వం పై పౌరసత్వ సవరణ చట్టం ఇతరయాత్రలపై విపరీతమైన విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉండడం మోడీ ప్రభుత్వానికి మింగుడు పడడం లేదని అంటున్నారు. 

2019 ఎన్నికలకు ముందు సైతం విమర్శించినా, ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుండి మోడీ ప్రభుత్వం పై విమర్శల వెల్లువ మొదలయింది. ముఖ్యంగా పౌరసత్య్వా సవరణ చట్టానికి వ్యతిరేకంగా "కోట్ల మంది ముస్లింలను పౌరసత్వం లేని నిరాశ్రయులుగా మార్చే చట్టం" అని సీఏఏ పై తీవ్రస్థాయిలో మండి పడింది. 

ఈ వార్తాకథనం ప్రచురితమైన తరువాత దేశవ్యాప్తంగా విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమయింది. చాలా మంది సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని తెలియపరిచారు. ఆఖరకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఈ విషయమై మాట్లాడి క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also read; సిఏఏ ఎఫెక్ట్: ప్రధాని మోడీకి రామకృష్ణ మఠం షాక్... 

అంతే గాకుండా, భారతదేశానికి చెందిన కొందరు ప్రముఖ జర్నలిస్టులకు వాషింగ్టన్ పోస్ట్ వారి వద్ద జాబ్ ఆఫర్స్ కల్పించింది. మోడీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్న బర్ఖ దత్, రానా అయూబ్ వంటి జరణలిస్టులు అక్కడ మోడీ కి వ్యతిరేకంగా తమ కలానికి పని చెబుతున్నారు. 

ఈ అన్ని పరిణామాల నేపథ్యంలోనే మోడీ జెఫ్ బెజోస్ ని కలవడానికి ఆసక్తి చూపెట్టడం లేదని తెలియవస్తుంది. ప్రభుత్వ వర్గాలు షెడ్యూల్ కుదరక పోవడంతో పాటు వేరే కారణం కూడా చెబుతున్నాయి. ఈ ఆన్ లైన్ దిగ్గజం భారతదేశంలో ప్రవేశించడం వల్ల తమ వ్యాపారంలో నష్టపోతున్నామని దుకాణదారులు దేశమంతా నిరసనలు తెలుపుతున్నారు. 

ఈ నిరసనల మధ్య అమెజాన్ సీఈఓ ను గనుక కలిస్తే, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలుపోయి, రాజకీయంగా బీజేపీకి మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే... వాల్ మార్ట్ అధినేత సామ్ వాల్టన్ గనుక వస్తే కలవరా...? లేదా భారత దేశంలో ఆన్ లైన్ బిజినెస్ చేసే ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలను ఏర్పాటు చేయడానికి సహకారం అందించారా?

వీటన్నిటిని బట్టి చూస్తుంటే, బీజేపీ ప్రభుత్వంపై, మోడీపై ఏ మాత్రం విమర్శనాత్మకంగా మాట్లాడినా ప్రభుత్వ ఆగ్రహానికి గురవ్వాల్సిందేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.