కోల్కతా: ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా బేలూరులోని రామకృష్ణ మఠాన్ని సందర్శించి, అక్కడ స్వామి వివేకానంద ధ్యానం చేసిన గదిని, ఇత్యాదులను దర్శించి నివాళులర్పించిన ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ఇక్కడి దాకా బాగానే ఉంది... ఆ తరువాత అక్కడ సభలో మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టంపై మోడీ మాట్లాడడాన్ని రామకృష్ణ మిషన్ తప్పుబట్టింది. 

రాజకీయాలకు రామకృష్ణ మఠంలో తావులేదని వారు చెప్పారు. మోడీ ఇక్కడ ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆ ట్రస్టులో సీనియర్ సభ్యుడు ఒక ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ అన్నాడు. వివాదాస్పదమైన రాజకీయ వ్యాఖ్యలని ఇలాంటి ఆధ్యాత్మిక మఠంలో చేయడం తమను తీవ్రంగా బాధించిందని వారు అన్నారు. 

రామకృష్ణ మఠం వేదికలమీద మాట్లాడడానికి ఉన్న రెండు నియమాలను మోడీ తోసిపుచ్చి మరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారని వారు అన్నారు. మొదటగా, రామకృష్ణ మఠం వేదికపైన ప్రసంగించడానికి ఒక పెద్ద ప్రహసనం ఉంటుంది. దాన్ని మోడీ ఫాలో అవ్వలేదని, అంతే కాకుండా రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డాడు.

Also read: సీఏఏపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదేళ్ల షాకింగ్ కామెంట్స్ 

ఆరెస్సెస్ కు చెందిన చాలా మంది ఆధ్యాత్మిక గురువులు నిమ్మనెమ్మదిగా రామకృష్ణ మఠం లోకి ప్రవేశించడం, వారు ముఖ్యపదవుల్లోకి వెళ్లడం వల్ల రామకృష్ణ మఠం ఒక రకంగా రాజకీయ రంగు నెమ్మదిగా పులుముకోవడం ఆరంభించిందని ఆయన అభిప్రాయపడ్డాడు. మోడీ రాక కూడా ఇందులో భాగమేనని ఆయన అన్నాడు. 

ఆ తరువాత సాయంత్రానికి బేలూరు మఠం సెక్రటరీ మాట్లాడుతూ...ప్రధాని స్ప్పేచుపైన ఎటువంటి వ్యాఖ్యలు చేయబోమని తెలుపుతూనే రామకృష్ణ మఠం గొప్పతనాన్ని వివరించారు. మఠంలో హిందూ, ముస్లిం,క్రైస్తవ, బౌద్ధ మతానికి చెందిన సన్యాసులు కూడా ఉంటారని, అందరూ కలిసిమెలిసి ఉంటారని అన్నారు. మొత్తానికి రామకృష్ణ మఠం వారు మోడీకి  ఊహించని షాక్ ఇచ్చారు.