మహారాష్ట్ర రాజకీయాలకు ఎట్టకేలకు ఒక కొలిక్కి వాచినట్టు అనిపిస్తున్నాయి. గత శుక్రవారం కూడా ఇలానే అనుకున్నప్పటికీ శనివారం ఉదయం నిద్ర లేచేసరికి అక్కడ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. నిన్న ఫడ్నవీస్ ప్రెస్ మీట్ తరువాత మాత్రం ఇక ప్రస్తుతానికి ఎటువంటి కొత్త ఈక్వేషన్స్ ఉండవని మాత్రం అర్థమవుతుంది. 

అందరికి మనసులో ఉద్భవిస్తున్న ఒక ప్రశ్న. అజిత్ పవార్ పార్టీని వీడుతున్నాడని, కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీతోని కలువబోతున్నాడని శరద్ పవార్ కి తెలియదా? శరద్ పవార్ ను దగ్గరనుండి చూసినవారికైనా, శరద్ పవార్ వ్యవహారశైలి తెలిసిన వారికైనా శరద్ పవార్ కి ఇది తెలియకుండా ఉండే సమస్యే లేదు అనేది సుస్పష్టం. 

మరి శరద్ పవార్ కి తెలిసినా శరద్ పవార్ ఏమి చేయలేదా? శరద్ పవార్ ఇలా తన పార్టీ కుటుంబం చీలిపోతుంటే చూస్తూ ఊరుకునే వాడు కాదు. అతనేమీ బాల్ ఠాక్రే కాదు. తన అన్న కొడుకు రాజ్ ఠాక్రే పార్టీనుంచి వెళ్లిపోతున్నా చూస్తూ ఊరుకోవడానికి. అతను శరద్ పవార్ తన సామ్రాజ్యం అంతా కలిసుండాలని కోరుకునేవారు. తన సామ్రాజ్యం విచ్చిన్నం కాకుండా జాగ్రత్తపడేవాడు. కూతురి కోసం నా కొడుకుని పక్కనబెట్టేందుకు ససేమిరా ఒప్పుకోడు.

Also read: కాంగ్రెస్‌తో స్నేహామా: శివసేనతో 20 ఏళ్ల బంధాన్ని తెంచుకున్న నేత 

మరి ఇంతలా తన కుటుంబాన్ని కాపాడుకోవాలనే శరద్ పవార్ అజిత్ పవార్ ని వారించలేదా? దీనికి సమాధానం కావాలంటే మనం నరేంద్ర మోడీ శరద్ పవార్ ల భేటీ గురించి లోతుగా అధ్యయనం చేయవలిసి ఉంది. అజిత్ పవార్ పార్టీని చీల్చే ఆస్కారం ఉంది అని అప్పటికే వార్తలు జోరుగా షికార్లు చేస్తున్నాయి. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ముంబైలో అడుగుపెట్టిన విషయం దగ్గర నుంచి అజిత్ పవార్ ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఎవరిని కలిసాడు వంటి అన్ని విషయాలను నిశితంగా గమనిస్తున్నాడు. 

మిగిలిన రాజకీయ నాయకులకు శరద్ పవార్ కు ఉండే ప్రధానమైన తేడా ఏమిటంటే, అతను ఖచ్చితంగా వాస్తవికంగా ఎకాడ ఏమి జరుగుతుందో పార్టీ కార్యకర్తల నుంచి నేతల నుంచి తెలుసుకుంటాడు. ఇతర నాయకుల్లాగా కార్యాలయాలకు మాత్రమే పరిమితం ఎవ్వడు. 

శరద్ పవార్ మోడీని కలిసినప్పుడు ఖచ్చితంగా తన కుటుంబం జోలికి రావొద్దు అని చెప్పి ఉంటాడు. ఎన్నికలకు ముందు సిబిఐ,ఈడీ రకరకాలుగా శరద్ పవార్ ని ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కూడా కామ్ గానే ఉన్న శరద్ పవార్ తన కుటుంబం జోలికి మాత్రం రావొద్దని, దాన్ని విచ్చిన్నం చేసే కుట్ర చేయవద్దని అనుంటాడు. 

చాలాసార్లు పవార్ శకం సమాప్తం అయిపోయిందన్న ఫడ్నవీస్ మాటలనే ప్రామాణికంగా తీసుకున్నారేమో, శరద్ పవార్ అన్నకొడుక్కు గాలం వెయ్యడం మాత్రం బీజేపీ మానలేదు. ఇవి అవకాశవాద రాజకీయాలా కాదా అనే చర్చ అప్రస్తుతం. అన్ని పార్టీలు చేస్తున్న రాజకీయాలు కూడా ఇదే కోవలోకి వస్తాయి. ఇంకో అడుగు ముందుకేస్తే బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నన్నా అవతరించింది, నాలుగో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అధికారం కోసం పాకులాడినప్పుడు వేరే పార్టీలేమి దానికి అతీతం కాదు. 

Also read: అన్నాచెల్లిలి అనుబంధం: అజిత్ పవార్‌ను హత్తుకున్న సుప్రియా సూలే

ఈ పరిస్థితుల్లో ఎలాగైనా ఈ విషయాన్ని ఆపాలని శరద్ పవార్ విశ్వా ప్రయత్నం చేసాడు. శరద్ పవార్ ఒకింత తన పార్టీ ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకోగలననే నమ్మకం ఉండబట్టే అజిత్ పవార్ బయటకు వెళ్ళగానే అందరిని ఒక్కరోజుకల్లా వెనక్కి తీసుకొని రాగలిగారు. శివసేన సేన ట్రీట్మెంట్ ఆ లేక ఇంకొకతా కానివ్వండి కానీ మొత్తానికి అయితే అందరిని వెనక్కి తీసుకొచ్చారు. 

ఎమ్మెల్యేలను వెనక్కి తీసుకురావడం మాత్రమే కాదు, అజిత్ పవార్ ని సైతం లాగేదాకా తెగకుండా పార్టీలోకి ఆహ్వానం పంపుతూనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు ఎంత మాత్రమూ ఆస్కారం లేదని భావించిన అజిత్ పవార్ తిరిగి ఎన్సీపీ గూటికి చేరారు. 

అజిత్ పవార్ తిరుగుబాటు చేయడానికి కారణాలు.... 

అజిత్ పవార్ తిరుగుబాటు చేయడానికి ముఖ్యంగా పవార్ కుటుంబంలోని వారసత్వ పోరు. శరద్ పవార్ కూతురు సుప్రియ సూలే ఢిల్లీలో శరద్ పవార్ వారసురాలిగా చక్రం తిప్పుతున్నారు. పార్టీలకు అతీతంగా ఆమెకు స్నేహితులు ఉన్నారు. కాకపోతే ఆమె ఎప్పటినుండో కూడా తాను ఢిల్లీకి మాత్రమే పరిమితమవుతానని, మహారాష్ట్రలో పవార్ సాబ్ రాజకీయ  వారసుడు దాదానే అని చెబుతూ వస్తుంది. చెబుతున్నట్టుగానే తాను ఇక్కడ ఎక్కువగా తలదూర్చడంలేదు. 

కాకపోతే కుటుంబసభ్యులమధ్య దూరం ఒకింత పెరిగిన మాట మాత్రం వాస్తవం. అజిట్గ్ పవార్ శరద్ పవార్ నీడగా మాత్రమే తెలుసు తప్ప శరద్ పవార్ అంత పాపులర్ మాత్రం కాదు. ఈనేపథ్యంలో అజిత్ పవార్ కు చెల్లి సుప్రియ సూలే పట్ల ఎప్పుడు అభద్రతా భావంతోనే ఉండేవాడు. 

ఈ నేపథ్యంలో వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోదలిచాడు. ఎన్సీపీ లో ఉన్న చాలామంది సీనియర్లు వెళ్లి బీజేపీలో చేరారు. పార్టీ దాదాపుగా ఖాళీ అయ్యింది. ఈ నేపథ్యంలో కొత్తవారికి చాలా మందికి టిక్కెట్లు ఇచ్చారు. వారిలో చాలా మంది గెలిచారు కూడా. తనకు 35 మంది మద్దతు తెలుపుతున్నారని అజిత్ పవార్ ప్రకటించారు. వారిలో దాదాపు 25 మంది కొత్తగా గెలిచినవారే. అధికారం కోసం వారు చాలా తేలికగా లొంగుతారని అజిత్ పవార్ భావించాడు. కానీ శరద్ పవార్ ముందు అజిత్ పవార్ పాచికలు పారలేదు. 

Also read: కర్ణాటక పాఠం... మహారాష్ట్రలో ముందుగానే బీజేపీ ప్లాన్ బి సిద్ధం?

ఇలా శరద్ పవార్ అజిత్ పవార్ ఏమి చేయబోతున్నాడని తెలియకుండా అయితే మాత్రం లేడనేది సుస్పష్టం. తొలుత అజిత్ పవార్ పట్ల తీవ్ర పదజాలాన్ని ఉపయోగించిన శివసేన నేతలు మరుసటిరోజు నుంచే అతడు అమాయకుడు అనే రాగాన్ని అందుకున్నారు. ఇంకో పరిశీలించాల్సిన అంశం ఏమిటంటే, శరద్ పవార్ పట్ల నిన్నటివరకు కూడా అందరూ ఒకింత అనుమానంతో చూసినప్పటికీ కూడా, శివసేన నేతలు కానీ, కాంగ్రెస్ నేతలు కానీ ఆయన్ని అనుమానించలేదు. 

ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో చివరాఖరకు ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే,శరద్ పవార్ కు ఈ పరిణామాలపట్ల పూర్తి అవగాహన ఉంది. దానితోపాటు ఈ పరిస్థితి వస్తే ఎలా ఎదుర్కోవాలో కూడా సంసిద్ధుడయి ఉన్నట్టు మనకు కనపడుతుంది. ఈ వయసులో శరద్ పవార్ పోరాటం తన అస్థిత్వాన్ని కాపాడుకోవడం కోసం.