యూపీ కొత్త సీఎం ఆ హాలీవుడ్ హీరో బ్రదరట!

  • ఆన్ లైన్ లో నెటిజన్ల సెటైర్లు
Yogi Adityanath and Vin Diesel Memes Flood social media

Yogi Adityanath and Vin Diesel Memes Flood social mediaఇంటర్నెట్ చేతికొచ్చాక జనాల సృజన పీక్ స్టేజ్ కి వెళ్లిపోతోంది. అవకాశం వచ్చిన ఏ అంశాన్ని వదలగుండా తమ క్రియేటివిటీని టన్నులకొద్ది వాడుతున్నారు నెటిజన్లు.

ఉత్తర ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్‌ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ లోపే ఆయనపై ఆన్ లైన్ లో లక్షల కామెంట్లు వస్తున్నాయి. వివాదస్పద హిందూ అతివాద నాయకుడిగా పేరున్న ఆయనను కొంతమంది హాలీవుడ్ హీరో విన్‌డీజిల్‌ బ్రదర్ గా పిలుస్తున్నారు.

త్రిపుల్ ఎక్స్ అనే మూవీలో నటించిన విన్ డీజిల్ ఇటీవల ఆ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఇండియా కూడా వచ్చారు. ఇదే సినిమాలో బాలీవుడ్ నటి దీపిక పదుకొనే కూడా నటించిన విషయం తెలిసిందే.

 

పూర్తి గుండుతో ఉండే విన్ డీజిల్...  యూపీ కొత్త సీఎం ఆదిత్యనాథ్ దాస్ చూడటానికి కాస్త ఒకెలా కనిపించడంతో నెటిజన్లు  వాళ్లిద్దరు అన్నదమ్ములని కామెంట్లు పెడుతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios