చైనాకి చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ మరో కొత్త మోడల్ ని భారత్ లో విడుదల చేసింది. ఈ రోజు ఉదయం ఢిల్లీలో ఎంఐ మ్యాక్స్ 2 పేరిట విడుదల చేశారు.
చైనాకి చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ మరో కొత్త మోడల్ ని భారత్ లో విడుదల చేసింది. ఈరోజు ఉదయం దిల్లీలో
ఎంఐ మ్యాక్స్ 2 పేరిట విడుదల చేశారు. ఈ ఫోన్ లో అత్యధికంగా 5300ఎంహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని పొందుపరిచారు. ఈ నెల 20వ తేదీ
నుంచి ఎంఐ.కామ్ వెబ్ సైట్ నుంచి ఈ ఫోన్ కొనుగోలు చేసుకోవచ్చు. డ్యూయల్ సిమ్ సదుపాయంగల ఈ ఫోన్ ధర రూ.16,999.
ఎంఐ మ్యాక్స్2 ఫీచర్లు
6.44 అంగుళాల తెర
5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా
12 మెగాపిక్సెల్ రేర్ కెమేరా
64జీబీ స్టోరేజ్ సామర్థ్యం
4జీబీ ర్యామ్
ఆండ్రాయిడ్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్
5300ఎంహెచ్ బ్యాటరీ సామర్థ్యం
