విజయవాడలో ఘోరం

విజయవాడలో ఘోరం

విజయవాడ సున్నపు బట్టీలు సెంటర్ లో గుంటూరు జిల్లా పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరుకు చెందిన కేసాని శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆత్మహత్యా యత్నం చేశారు. తాను చేసిన కాంట్రాక్ట్ పనులకు ఏళ్లుగా డబ్బులు ఇవ్వడం లేదంటూ కాంట్రాక్టర్ ఇంటిదగ్గర కత్తితో పొడుచుకుని ఆత్మహత్యా యత్నం చేశారు. 2009లో బాపట్ల మండలంలో పట్టాబి అనే కాంట్రాక్టర్ దగ్గర చేసిన పనికి గాను ఇంకా 40 లక్షలు ఇవ్వాలని....కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని శ్రీనివాస రావు చెప్పారు. మరో సారి డబ్బుల విషయం మాట్లాడడానికి విజయవాడలోని కాంట్రాక్టర్ ఇంటికి వచ్చాడు. అయితే, డబ్బులు వచ్చే వీలు లేకపోవడంతో కత్తితో కడుపులో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. తనకు రావాల్సిన డబ్బులు రాకపోవడంతో....తన కుటుంబం అప్పుల పాలయ్యిందని.....తన మరణాంతరం అయినా తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకున్నాడు. ఆసుపత్రికి వచ్చేందుకు కూడా శ్రీనివాసరావు నిరాకరించారు. శ్రీనివాసరావు ప్రాణానికి ఎటువంటి హామీ లేదని డాక్టర్లు చెప్పారు.ఆత్మహత్య కు ముందే నిర్ణయించుకున్న శ్రీనివాస రావు లెటర్లతో సహా విజయవాడ కాంట్రాక్టర్ ఇంటికి వచ్చారు. కాంట్రాక్టర్ దాదాపు 40 లక్షల దాకా  బకాయీ ఉన్నాడని చెబుతున్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos