టిటిడిపి వర్కిగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం. తెలంగాణాలో టిడిపి శాసనసభా పక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు రేవంత్ భారీ స్కెచ్ వేసినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఉన్న ముగ్గురు ఎంఎల్ఏల్లో ఇద్దరు గనుక విలీనానికి సంతకం పెడితే చాలు పనైపోయినట్లే.

టిటిడిపి వర్కిగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం. తెలంగాణాలో టిడిపి శాసనసభా పక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు రేవంత్ భారీ స్కెచ్ వేసినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఉన్న ముగ్గురు ఎంఎల్ఏల్లో ఇద్దరు గనుక విలీనానికి సంతకం పెడితే చాలు పనైపోయినట్లే. ఎలాగూ రేవంత్ ఉన్నారు కాబట్టి మిగిలిన ఇద్దరిలో ఒక్కరి సంతకాన్ని గనుక సంపాదించ గలిగితే చాలు రేవంత్ టార్గెట్ పూర్తయినట్లే.

పోయిన ఎన్నికల్లో టిడిపి 15 అసెంబ్లీ స్ధానాలను గెలుచుకున్నది. అయితే, ఆకర్ష్ పథకంలో భాగంగా దఫదఫాలుగా పలువురు ఎంఎల్ఏలు టిఆర్ఎస్ లో చేరిపోయారు. టిఆర్ఎస్ లో చేరిన టిడిపి ఎంఎల్ఏల సంఖ్య 12కు చేరుకోగానే తమదే అసలైన టిడిపి అంటూ టిడిపి ఎంఎల్ఏలు టిడిపిఎల్పీని టిఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. స్పీకర్ కూడా వెంటనే వారి ప్రకటనను ఆమోదిస్తూ వారందరినీ టిఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తూ ప్రకటన విడుదల చేసేసారు.

అయితే, అప్పటి టిడిపి ఎంఎల్ఏలు లేఖ ఇవ్వటాన్ని, విలీనం చేస్తూ స్పీకర్ చేకసిన ప్రకటనను తప్పు పడుతూ ఇదే రేవంత్ అప్పట్లో కోర్టులో కేసు వేసారు. ఆ కేసు ఇంకా విచారణలోనే ఉంది. అదే కేసు, ఇపుడు రేవంత్ కు మార్గదర్శనం అవుతున్నట్లుంది. అప్పట్లో తమదే అసలైన టిడిపి అని ప్రకటించుకున్నా టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఏమీ చేయలేకపోయారు. ఇపుడు రేవంత్ అదే పని చేసినా చంద్రబాబు చేయగలిగేది ఏమీ లేదు.

రేవంత్ ప్రయత్నాలను అడ్డుకునేందుకే చంద్రబాబు తెలంగాణా టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణను అడ్డంపెట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, రేవంత్ ప్రయత్నాన్ని రమణ ఎంత వరకూ అడ్డుకోగలరన్నదే ప్రశ్న. ఒకవేళ రేవంత్ గనుక గురువారం టిటిడిఎల్సీ సమావేశం పెట్టి రెండో సంతకాన్ని గనుక సాధించగలిగితే రెండు స్ధానాల్లోనూ ఉప ఎన్నిక కూడా అవసరం ఉండదు. అంటే టిటిడిఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసేయటంతో పాటు ఉపఎన్నికలను కూడా తప్పించినట్లవుతుంది. మొత్తం మీద రేవంత్ చంద్రబాబుకు భారీ షాకే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.