వెండితెరపై సూపర్ స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న రజనీ రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరిక్షించుకోవాలనే ‘చిరు’ కోరికను మాత్రం నెరవేర్చుకోలేకపోతున్నాడు.
రావడం లేటవచ్చేమో... రావడం మాత్రం గ్యారెంటీ అనేలా సిగ్నల్స్ ఇస్తున్నాడు తళైవా... టీజర్ రీలైజ్ అయింది ఇక సినిమానే విడుదల కావాలి అనేలా తమిళనాట ఎన్నికల వేళ రజనీ కాంత్ రాజకీయ ప్రవేశం వార్తలు షికార్లు చేస్తుంటాయి. తీరా ఈ సూపర్ స్టార్ మాత్రం దేవుడు శాసించాలి అనే రోటీన్ డైలాగ్ తో ఎన్నికల గండాన్ని గట్టుక్కిస్తుంటాడు.
వెండితెరపై సూపర్ స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న రజనీ రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరిక్షించుకోవాలనే ‘చిరు’ కోరికను మాత్రం నెరవేర్చుకోలేకపోతున్నాడు.
పార్టీ పెట్టాలి సీఎం కూర్చీలో రాష్ట్రాన్ని ఏలాలని మనసులో ఉన్న ఆ విషయాన్ని బయటపెట్టలేని పరిస్థితి ఆయనది. ముఖ్యంగా తమిళనాట సరైన పరిస్థితులు లేవు. ఇన్నాళ్లు తమిళనాట ఉన్న రెండు పార్టీలు చాలా బలమైనవి. రాజకీయ శూన్యత అనేది లేనే లేదు. అందుకే ఆయన తన రాజకీయ సంకల్పానికి ప్రతీసారి పేకప్ చేప్పేస్తూనే ఉన్నారు.
అయితే ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవే రజనీకాంత్ కంటే చాలా బెటర్. పరిస్థితుల గురించి పట్టించుకోలేదు. రాజకీయశూన్యత గురించి విచారించలేదు. డైలామాలో పడకుండా డైనమిక్ గా ముందుకొచ్చారు. సీఎం సీటులో కూర్చోకపోయినా రాజకీయంగా తనకంటూ ఒక ఇమేజ్ మాత్రం తెచ్చుకోగలిగారు. ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తూ సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ కుమ్మేస్తున్నారు.
కానీ, రజనీ మాత్రం ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. దేవుడు ఎప్పుడు శాసిస్తాడా అనే ఎదరుచూస్తూనే ఉన్నారు. రాజకీయాల్లోకి రావాలన్న చిరు కోరిక ఉన్నప్పటికీ ‘చిరు’ పరిస్థితే తనకూ ఎదురవుతోందేమోనని వెనకడుగు వేస్తూనే ఉన్నారు.
కానీ, ఇప్పుడు పరిస్థితులు అనుకూలించాయి. బలమైన రెండు పార్టీల నేతల్లో ఒకరు లేరు. మరొకరు సారథ్యం పక్కన పెట్టారు. ఇప్పుడైనా కబాలి ఎంటరవుతాడా... మళ్లీ పాత డైలాగ్ రిపీట్ చేస్తాడా అనేదే చూడాలి.
