శరద్ పవార్ కూతురికి క్యాబినెట్ లో చోటిచ్చేందుకు ప్రధాని మోదీ ఆహ్వానం పంపారు కెసిఆర్ కూతురు కవితకి ఇలాంటి ఆహ్వానం రాలేదెందుకు? మోదీ టిఆర్ ఎస్ ను లెక్క చేయడం లేదా???
ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు, నిజాంబాద్ ఎంపి కవితను క్యాబినెట్ లోకి తీసుకునేందుకు ప్రధాని మోదీ ఎందుకు ముందుకు రావడం లేదు? ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి స్నేహం కేంద్ర క్యాబినెట్ దాకా ఎందుకు సాగడం లేదు... ఇది కొంత ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మహారాష్ట్ర నేత,ఎన్ సిపి అధ్యక్షుడు శరద్ పవార్ కూతురు సుప్రియా సూలేని క్యాబినెట్ లోకి తీసుకునేందుకు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఆమెనుక్యాబినెట్ లోకి తీసుకునేందుకు అంగీకరించమని స్వయంగా ప్రధాని మోదీ పవార్ ను కోరారు. ఇది టిఆర్ ఎస్ విషయం లో జరిగి నట్లు లేదు. నిజానికి పవార్ ఎన్డీఎకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మొన్న రాష్ట్రపతి,ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన సోనియా గాంధీతోకలసి రామ్ నాథ్ కోవింద్ కు, వెంకయ్యనాయుడికి పోటీ పెట్టడంలో ముందున్నారు. ఆయన ఎపుడూ ఎన్డీయే ప్రభుత్వాన్ని వెనకేసుకుకొచ్చింది లేదు . అయినా సరే పవార్ కూతురు సుప్రియకు క్యాబినెట్ తలుపులు తెరిచిపెట్టారు.
టిఆర్ ఎస్ అధినేత కూతురు కవిత కూడా ఢిల్లీలో ఉన్నా, పసుపు బోర్డు అనో, మరొకటనో ఆమె రెండుమూడు సార్లు ప్రధాని ని కలిశారు కూడా. ఇదే విధంగాచాలా సార్లు ప్రధానిని ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా చాలా సార్లు కలిశారు. అయితే, కవితను క్యాబినెట్ లోకి పంపండని అడిగినట్లు కనిపించదు.
టిఆర్ ఎస్ ఎపుడూ ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్ డిఎ ప్రభుత్వంతో పేచీపడలేదు,అపుడపుడు రాష్ట్రానికి రావలసినవి, హామీ ఇచ్చినవి ఇవ్వలేదన్న స్టేట్ మెంట్ తప్ప. తెలంగాణలో బిజెపి నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంత సౌండ్ చేసినా ఆ పార్టీని టి ఆర్ ఎస్ అంతసీరియస్ గా లేదు. రాష్ట్ర కమిటి అధ్యక్షుడు లక్ష్మణ్ నాయకత్వంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాత్రలు చేసిన, ఉద్యమాలు చేసినా అధికార పార్టీకి ఆ బాణాలు గుచ్చుకోవడమే లేదు. కారణం, ముఖ్యమంత్రి కెసిఆర్ మోదీ నాయకత్వం మీద గురి ఉందని చాలాసార్లు చెప్పారు. మొన్న రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. అయినా సరే, టిఆర్ ఎస్ ని ఎన్డీయే లోకి ఆహ్వానించడం గాని, క్యాబినెట్ సీటు ఆఫర్ చేయడం జరిగినట్లు లేదు.
పవార్ కూతురుకి క్యాబినెట్ స్థానం కల్పించేందుకు ఇచ్చిన ఆపర్ గురించి పవార్ స్వయంగా వెల్లడించారు.
ఈ విషయాన్ని మొదట శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకుడు సంజయ్ రౌత్ (ఎంపి) సంపాదకీయంలో వెల్లడించారు. దీనికి ముందు రౌత్ పవార్ తో సమావేశమయ్యారు. ఎన్ సిపి ఎన్డీయే క్యాబినెట్ లో చేరుతుందని పత్రికలలో వస్తున్న వార్తలగురించి వాకబు చేశారు. అపుడు పవార్ అవన్నీఅబద్దాలని కొట్టేశారు. అయితే, వాస్తవం ఇలా చెప్పారు. ‘ఒక సారి ప్రధాని మోదీ తో సమావేశమయినపుడు సుప్రియ ను క్యాబినెట్ లో ఉండాల్సిన అవసరం ఉందని మోదీ చెప్పారు.అపుడు సుప్రియ కూడా అక్కడే ఉంది. ఆమె జోక్యం చేసుకుంటూ, తాను ఏ పరిస్థితుల్లోను బిజెపిలో చేరను అని స్పష్టం చేశారు,’ అని పవార్ చెప్పారు.
పార్లమెంటు లో అత్యంత యాక్టివ్ సభ్యురాలు కవిత. కవితకు క్యాబినెట్ సీటు ఇచ్చేందుకుప్రధాని ఎందుకు ముందుకు రావడం లేదు?
టిఆర్ ఎస్ ను ప్రధాని ఖాతరు చేయడం లేదా?
