Asianet News TeluguAsianet News Telugu

"కేర‌ళ‌ను గాడ్స్ ఓన్ కంట్రీ" అని ఎందుకంటారో తెలుసా...?

  • ఓనం పండుగను ఘనంగా జరుగుపున్న కేరళవాసులు.
  • ఓనం పండుగ నృత్యాలు చేసిన క్రిస్టియన్ సిస్టర్స్.
  • ఆ వీడియోను షేర్ చేసిన ఎంపీ శశి థరూర్.
  • వైరల్ అయినా వీడియో.
Why makes Kerala Gods Own Country

"కేర‌ళ‌ను గాడ్స్ ఓన్ కంట్రీ" అని పిలుస్తారు.. ఎందుకు పిలుస్తారో కార‌ణం చెప్పారు కాంగ్రెస్ ఎంపీ  శ‌శి థ‌రూర్. సెప్టెంబ‌ర్ 4న కేర‌ళ వ్యాప్తంగా ఓనం పండుగ‌ను అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకున్నారు. అయితే ఈ సంద‌ర్భంగా అక్క‌డ కొంద‌రు క్రైస్త‌వ సిస్ట‌ర్స్‌ వేసిన ఓనం నృత్యం వీడియోను ఎంపీ త‌న ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశారు. కొద్దిసేప‌ట్లోనే ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ వీడియోకు  శ‌శి థ‌రూర్ ఇలా ట్యాగ్ చేశారు... ఓనం సంద‌ర్భంగా వేసిన పూక్క‌ల‌మ్ (పూల‌తో వేసిన ముగ్గు) చుట్టూ సంప్రదాయ‌క తిరువ‌త్తిర‌కాలీ నృత్యం వేయ‌డం ఈ వీడియోలో చూడొచ్చు. "కేర‌ళ‌ను గాడ్స్ ఓన్ కంట్రీ అని ఇందుకే అంటారు. క్రైస్త‌వ స‌న్యాసినులు ఇలా హిందూ నృత్యం చేయ‌డం కేర‌ళ‌లో స‌ర్వ‌ సాధార‌ణ‌మే. మ‌తాల మ‌ధ్య ఏక‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించ‌డ‌మే ఓనం ప్ర‌త్యేక‌త‌" చెప్పారు.

 

 

 

 

మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి  

 

 

Follow Us:
Download App:
  • android
  • ios