రాజధాని నడిబొడ్డున ఉన్న ఒక యూనివర్సిటీ కి వెళ్లలేని పరిస్థితి ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి దేశంలో కెసిఆర్ ఒక్కరే.సీఎం కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ కి పోయే పరిస్థితి లేదు కాబట్టి ఉస్మానియాలో ఎవరూ కాలు పెట్టొద్దు. అందుకే మీటింగ్ పెట్టొద్దనే జీవో తెచ్చారు
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల విద్యార్థుల కేసీఆర్ కక్షా కట్టిన్నట్లు కనిపిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి )వ్యాఖ్యానించారు.
ఉస్మానియా లో రాజకీయ కార్యకలాపాలన్నింటి మీద నిషేధం విధించడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
‘సీఎం కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీకి పోయే పరిస్థితి లేదు ..అందుకే ఉస్మానియా లో ఎవరు కాలు పెట్టొద్దు.దీనికోసం మీటింగ్ పెట్టొద్దనే జీవో తెచ్చారు.కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉస్మానియా వెళ్తే రాళ్లు ,చెప్పులు పడుతాయి,’ అని జగ్గారెడ్డి అన్నారు.
ఆదివారం నాడు విలేకరులతో మాట్లాడుతూ,ఉస్మానియా విద్యార్థుల వల్లే తెలంగాణ వచ్చిందని చెబుతూ అలాంటి యూనివర్సిటీ పై రాజకీయ ఆంక్షలు పెట్టడం దుర్మార్గంమని ఆయన విమర్శించారు.
పిసిసి అధ్యక్షుడు త్తమ్ కుమార్ రెడ్డి ఉస్మానియా లో రాహుల్ గాంధీ తో సభ పెడతానని చెప్పినందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు..
రాజధాని నడిబొడ్డు న ఉన్న ఒక యూనివర్సిటీ కి వెళ్లలేని పరిస్థితి ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి దేశంలో కెసిఆర్ మాత్రమేనని ఆయన అన్నారు.
‘‘ఉత్తమ్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ లో సభ పెట్టి తీరుతాం.విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది.భవిష్యత్తులో కేసీఆర్ కి విద్యార్థుల తగిన బుద్ది చెప్తారు..
తక్షణమే ప్రభుత్వం జీవో ని వెన్నకి తీసుకోవాలి,’’ అని ఆయన డిమాండ్ చేశారు.
