అమ్మ మృతి తర్వాత సంచలనాలకు కేంద్ర అవుతోన్న మెరీనా తీరం

చెన్నైలోని మెరీనా తీరం ...

ఆ చల్లని సముద్రగర్భం... కొన్నాళ్లుగా అలజడి రేపుతోంది...

జనసంద్రంతో ప్రపంచాన్నే తన వైపు తిప్పుకుంటోంది...

ఇన్నాళ్లు అక్కడ నీళ్లు ఎగిసిపెడితే... ఇప్పుడు జనకెరటాలు ఎగిసిపడుతున్నాయి...

ఇంతకీ ఆ మెరినా బీచ్ కు ఏమైంది...

జయలలిత మృతి తర్వాత మెరీనా బీచ్ జనసంద్రం అయింది. తమిళనాడు అంతా వచ్చి అక్కడే ఘోషించింది. ఆ తీరంలోనే అమ్మ శాశ్వతంగా సమాధిలో విశ్రమిస్తోంది.

ఆమె మృతి వార్త మరవకముందే మరో సంచలనంతో మెరీనా తీరం మరోమారు జనసంద్రం అయింది.

ఈ సారి జల్లికట్టుపై నిషేధం ఎత్తివేతకు యువకులు చేపట్టిన ఉద్యమానికి ఆ తీరం వేదికైంది. దాదాపు మూడు రోజులపాటు తమిళ యువత అంతా మెరీనా తీరంలో నినదించారు.

చివరకు కేంద్రమే తలవంచి నిషేధం ఎత్తివేసింది.

ఆ తర్వాత 144 సెక్షన్‌ విధించడంతో మరోసారి మెరీనా తీరం కలకలం రేపింది. ఈ తీరాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో కొన్నిరోజులపాటు అక్కడ తీవ్ర నిర్భంధాలు ఎదురయ్యాయి.

మంగళవారం మెరీనాలోని ‘అమ్మ’ సమాధి వద్ద సీఎం పన్నీరు సెల్వం మౌన దీక్ష చేపట్టడంతో మరోసారి తమిళరాజకీయం కీలకమలుపు తిరిగింది. మెరీనా తీరంలోనే రెండు కార్గో షిప్ ల్లో తరలిస్తున్న ఇంధనం సముద్రం పాలైంది. దాన్ని తొలగించడానికి కార్మికులు నానా కష్టాలు పడుతున్నారు.

ఇలా మెరీనా తీరం అమ్మ మృతి తర్వాత సంచలనాలకు కేంద్రంగా మారుతోంది.