Asianet News TeluguAsianet News Telugu

స్టీల్ ప్లాంట్ వచ్చే దాకా ఉద్యమం ఆగదు

 రాయలసీమలో స్టీల్ ప్లాంట్ కోసం తీవ్రమవుతున్న ఉద్యమం

we wont stop the movement till steel pant is set up

we wont stop the movement till steel pant is set up

ఉక్కు పరిశ్రమ సాధించే వరకు రాయలసీమ  ఉక్కు ఉద్యమం ఆగదని స్టీల్ ప్లాంట్ సాధన సమితి  అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు  ప్రొద్దుటూరు సూపర్ బజార్ రోడ్ లోని భావన జూనియర్ కాలేజ్  లో జరిగిన రాయలసీమ విద్యార్థి గర్జన లో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్బంగా మాట్లాడుతూ కర్ణాటక లో బ్యాంక్ ఉద్యోగాల రాత పరీక్షల కోసం వెళ్లిన తెలుగు విద్యార్థుల పై కర్ణాటకకు చెందిన వారు దాడి చేయడం అమానుషం అన్నారు.ఇదే రాయలసీమ లో ఉక్కు పరిశ్రమలు వచ్చి ఉంటే ఉద్యోగ అవకాశాలు ఇక్కడే ఉండేవని,ఇప్పటికైనా రాయలసీమ కు చెందిన అన్ని రాజకీయ పార్టీ లు స్పందించి వెంటనే ఉక్కు పరిశ్రమ ను ఏర్పాటు చేయడం మీద కేంద్ర,రాష్ట్ర  ప్రభుత్వాల మీద వత్తిడి తీసుకురావాలని అన్నారు.   నిరుద్యోగ యువతకు బంగారు బాట వేయాలని, చిత్త శుద్ది తో కృషి చేయలని ఆయన విజ్ఞప్తి చేసారు.రాయలసీమ లోని ఖనిజాలు వేలికి తీసి  ఇక్కడే పరిశ్రమను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రాయలసీమ లో ఉండే ఖనిజ సంపదను ఉపయోగించుకొని ఇక్కడే పరిశ్రమను నెలకొల్పితే నిరుద్యోగా యువత మరియు భావి తరాల విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని అన్ని రాజకీయ పక్షాల కు విజ్ఞప్తి  చేశారు

Follow Us:
Download App:
  • android
  • ios