వరంగల్ లో ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

First Published 27, Nov 2017, 4:43 PM IST
warangal girl suicide
Highlights
  • వరంగల్ జిల్లాలో దారుణం
  • ఇంటర్మీడియట్ విద్యార్థిని సిందూజ ఆత్మహత్యాయత్నం
  • పరిస్థితి విషమం

వరంగల్‌ జిల్లా హన్మకొండలో ఓ కాలేజి విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.హన్మకొండ లోని ఏకశిల కాలేజ్ లో ఇంటర్‌ చదువుతున్న సింధుజ ఆత్మహత్యకు యత్నించింది. భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో అక్కడున్నవారు తీవ్రగాయాలపాలైన సింధుజను చికిత్స నిమిత్తం హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు.  

అయితే విద్యార్థి ఆత్మహ్యతకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

loader