పోలీసులు విజయవాడలో అరెస్టు చేసినంత మాత్రాన తన సవాల్ వీగిలపోలేదని, డిబెట్ కొనసాగుతుందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రకటించారు. పట్టీసీమ ఫ్రాడ్ అని, కేవలం కమిషన్ ల కోసం నిర్మిస్తున్నారని 9 విలేకరుల సమాావేశాలు ఏర్పాటుచేశానని, ముఖ్యమంత్రి 7 లేఖలు రాశానిని చెబుతూ తాను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు రాలేదని ఆయన విజయవాడలో అన్నారు.ఇలాంటపుడు టిడిపి ఎమ్మెల్యేబుచ్చయ్య చౌదరి ముందుకు రావడంసంతోషమని చెప్పారు. అయితే, ఆయన రాజమండ్రి కాకుండా విజయవాడ ప్రకాశం  బ్యారేజీ ని ఎందుకు వేదిక చేశారో తెలియడంలేదని అన్నారు.రాజమండ్రిలో చక్కగా  చర్చించి ఉండవచ్చు. ఈ విషయం గురించి ఆయన ఆలోచిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.