ఐశ్వర్యారాయ్ మా అమ్మ.. విశాఖ కుర్రాడు

vizag guy  Claims Aishwarya Rai Bachchan Is His Biological Mother
Highlights

  • ఐశ్వర్య మా అమ్మ అంటూ యువకుడి హల్ చల్
  • తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ మారిన వార్త

అందరిలో గుర్తింపు పొందడానికి, మీడియాలో ఫేమస్ అవ్వడానికి చాలా మంది చాలా వెర్రి వేషాలు వేస్తుంటారు. ముఖ్యంగా సెలబ్రెటీలతో రక్త సంబంధం ఉందని చెబుతూ మీడియా వద్ద హడావిడి చేస్తుంటారు. మొన్నటికి మొన్న ఓ వ్యక్తి తాను మెగాస్టార్ చిరంజీవికి కొడుకునంటూ కొద్ది రోజులు హడావిడి చేశాడు. తమిళనాడులో ఇద్దరు దంపతులు.. హీరో ధనుష్ కి తల్లిదండ్రులం అంటూ కోర్టుకి ఎక్కారు. తాజాగా.. విశాఖపట్నానికి చెందిన ఓ కుర్రాడు.. బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యారాయ్ కుమారుడినంటూ చెబుతున్నాడు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది.

 

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అతని మాటల్లోనే..‘‘ నా పేరు సంగీత్ కుమార్. వయసు 29. 1988వ సంవత్సరం లండన్ లో ఐశ్వర్యారాయ్ నాకు జన్మనిచ్చింది. ఐవీఎఫ్ పద్దతిలో నేను ఆమెకు పుట్టాను. నాకు మూడేళ్లు వచ్చే వరకు మా అమ్మమ్మ బ్రిందా కృష్ణరాజ్ ల వద్ద ముంబయిలోనే ఉండేవాడిని. తర్వాత నన్ను విశాఖ లోని చోడవరానికి పంపించారు. 2017 మార్చిలో మా తాతయ్య కృష్ణరాజ్ రాయ్ చనిపోయారు. మా అంకుల్ పేరు ఆదిత్య రాయ్. 2007లో మా అమ్మ ఐశ్వర్య అభిషేక్ ని వివాహం చేసుకుంది. నాకు మా అమ్మ కావాలి. నేను మా అమ్మని బాగా మిస్ అవుతున్నాను. నేను విశాఖపట్నానికి వెళ్లను. మా అమ్మ నాతో వచ్చి మంగళూరులో ఉండాలి. కనీసం మా అమ్మ ఫోన్ నెంబర్ అయినా నాకు ఇవ్వండి. ఐశ్వర్య మా అమ్మ అని నిరూపించడానికి నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. వాటిని మా కుటుంబసభ్యులే నాశనం చేశారు.’’ అంటూ మంగళూరులో మీడియాతో చెబుతున్నాడు.దీంతో ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.

loader