అనుష్క నెక్లెస్ ఖరీదెంతో తెలుసా..?

First Published 22, Dec 2017, 1:39 PM IST
virushkas reception couple stun in traditional attire
Highlights
  • స్నేహితులు, సన్నిహితుల కోసం   దేశ రాజధాని ఢిల్లీలో గురువారం విరుష్క జంట రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
  • ఈ రిసెప్షన్ దేశ ప్రధాని నరేంద్రమోదీ కూడా హాజరవ్వడం గమనార్హం.

సెలబ్రెటీ ప్రేమ జంట.. విరాట్ - అనుష్కల వివాహం ఇటీవల ఇటలీలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి కేవలం కుటుంబసభ్యులను మాత్రమే ఆహ్వానించారు. దీంతో.. స్నేహితులు, సన్నిహితుల కోసం   దేశ రాజధాని ఢిల్లీలో గురువారం విరుష్క జంట రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ దేశ ప్రధాని నరేంద్రమోదీ కూడా హాజరవ్వడం గమనార్హం.

ఈ రిసెప్షన్ లో నూతన వధూవరులు ఇద్దరూ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన దుస్తులే ధరించారు.  సాంప్రదాయానికి పెద్ద పీట వేశారు. అనుష్క అయితే.. ఎరుపు రంగు బెనరసీ చేరలో అందంగా ముస్తాబైంది.  వీరి వివాహానికి కూడా సబ్యసాచే దుస్తులు డిజైన్ చేశారు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే  రిసెప్షన్ ముగిసిన నాటి నుంచి ప్రస్తుతం అందరూ ఒక విషయం గురించి చర్చించుకుంటున్నారు. అది ఏమిటో తెలుసా.. రిసెప్షన్ లో అనుష్క ధరించి నెక్లెస్. ఆ చోకర్ ధర గురంచే ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆ నెక్లెస్ ధర ఎంతో తెలుసా.. 25 నుంచి 30లక్షల వరకు ఉంటుందట.

ఈ నెక్లెస్ మాత్రమే కాదు.. పెళ్లిలో కోహ్లీ.. అనుష్క చేతికి తొడిగిన రింగు కూడా చర్చనీయాంశమే అయ్యింది. వీరి వివాహానికి అయిన ఖర్చు కన్నా కూడా.. రింగ్ కే కోహ్లీ ఎక్కువ ఖర్చు చేశాడనే వార్తలు వెలువడ్డాయి. కాగా.. ఈ జంట ఈనెల 26న ముంబయిలో రెండో విందును ఏర్పాటు చేయనుంది. ఆ తర్వాత వీరిద్దరూ దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరనున్నారు. నూతన సంవత్సర వేడుకలను అక్కడే జరుపుకోనున్నారు. ఆ తర్వాత జనవరి నుంచి అనుష్క ‘పరి’, ‘సూయీ ధాగా’ చిత్రాల్లో నటించనున్నారు.

loader