షాకింగ్ న్యూస్.. విరాట్, అనుష్కల పెళ్లి క్యాన్సిల్

Virat Kohli Anushka Sharma Wedding Cancelled Jokes Twitter After Dharamsala Debacle
Highlights

  • బ్రేకింగ్ న్యూస్.. విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ పెళ్లి వాయిదా పడింది. సాయంత్రమే కోహ్లీ వచ్చి జట్టులో చేరతాడని బీసీసీఐ ప్రకటించింది.

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల పెళ్లి రద్దు అయ్యిందా? కొద్ది గంటల ముందే కదా.. విరుష్క జంట ఇటలీలో పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించింది అప్పుడే మళ్లీ పెళ్లి రద్దు కావడం ఏమిటని కంగారు పడుతున్నారా..? ఇది నిజం కాదు లేండి వీరి పెళ్లి రద్దు అయ్యిందంటూ ట్విట్టర్ లో నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే..  శ్రీలంకతో  ధర్మశాలలో జరిగిన తొలివన్డేలో భారత్ ఓడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ కి కోహ్లీ దూరంగా ఉండవల్లే టీం ఇండియా ఓటమి పాలయ్యిందని నెటిజన్లు భావిస్తున్నారు. అందుకే మళ్లీ ఇండియా గెలవాలంటే కోహ్లీ ఆడాలని.. అందుకు పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలంటూ జోకులు వేస్తున్నారు.

నెటిజన్లు వేసిన సెటైర్లు ఇలా ఉన్నాయి..

1.బ్రేకింగ్ న్యూస్.. విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ పెళ్లి వాయిదా పడింది. సాయంత్రమే కోహ్లీ వచ్చి జట్టులో చేరతాడని బీసీసీఐ ప్రకటించింది.

2.ఇప్పుడే అందిన వార్త.. కోహ్లీ- అనుష్క వివాహం రద్దు. కోహ్లీ వెంటనే డ్రెస్సింగ్ రూమ్ లో రిపోర్ట్ చేయాలని రవిశాస్త్రి ఆదేశం.

3.అనుష్క.. నువ్వులేకుండా నేను బతకలేను

   కోహ్లీ.. నేను కూడా

   టీం ఇండియా.. డిట్టో

4.టీం ఇండియాతో విరాట్ కోహ్లీ.. పెళ్లికి ఎవర్నీ ఆహ్వానించడం లేదు. అనుష్క ఇదే చెప్పింది.

  టీం ఇండియా.. అయితే.. మేమెవ్వరం బ్యాటింగ్ చెయ్యం.

ఇలాంటి జోక్స్ చాలానే ఇప్పుడు ట్విట్టర్ లో కనిపిస్తున్నాయి.

loader