వరుణ్ పెళ్లి పై పుకార్లు కండించని వరుణ్

బాలీవుడ్ యువ‌ న‌టుడు వ‌రుణ్ ధావ‌న్  పెళ్లి పిక్స‌యింద‌నే పుకార్లు షికారు చేస్తున్నాయి. త్వ‌ర‌లోనే వ‌రుణ్ పెళ్లికొడుకు కాబోతున్నాడ‌నే వార్త‌లు హిందీ చిత్ర‌సీమ‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. గ‌త వారం రోజుల నుండి ముంబాయి ఫిల్మ్‌ న‌గ‌ర్ లో వ‌రుణ్ కి పెళ్లి డెట్ ఫిక్స్ అంటు ప్ర‌చారం జ‌రుగుతుంది, ఆయ‌న ప్రియురాలు న‌టాషా ద‌లాల్‌తోనే త‌న వివాహం జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.


న‌ట‌షా ద‌లాల్, వ‌రుణ్ ధావ‌న్ ల గురించి గ‌తం చాలా పుకార్లు వినిపించాయి. అయినా వాటిపై వ‌రుణ్ ఎలాంటి స్పంద‌న ఇవ్వ‌లేదు. మొద‌టిసారి ఈ విష‌యం గురించి బాలీవుడ్ న‌టి నేహా ధూపియా ఇంట‌ర్వ్యూలో మాట్లాడాడు వ‌రుణ్‌.  మా రిలేష‌న్ గురించి అంద‌రికీ తెలుసు. అది నా వ్య‌క్తిగ‌త విష‌యం, అందుకే నేనెప్పుడూ ప‌బ్లిగ్గా మాట్లాడ‌లేదు. ఆమె సినీ రంగానికి చెందింది కాదు అని అన్నారు. త‌రువాత ఆయ‌న త‌న ల‌వ‌ర్ గురించి ఎక్క‌డ మాట్లాడ‌లేదు.

న‌ట‌షా ద‌లాల్ ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్‌. వ‌రుణ్ సినిమాల‌కుడ్ర‌స్సుల‌కు డిజైన్ చేశారు. అప్ప‌టి నుండి వారి మ‌ధ్య ఎఫైర్ న‌డుస్తున్న‌ట్లు ప్ర‌చారం ఉపందుకుంది. అయితే ఇప్పుడు పెళ్లి పుకార్లు రావ‌డానికి కార‌ణం, ఇరువురు క‌లిసి ముంబాయిలో త‌రుచుగా షాపింగ్ చేస్తూ ప‌ట్టుబ‌డ్డారు. అందుకే ఇరువురు పెళ్లి చేసుకొబోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది


ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రుణ్ నుండి ఈ విష‌యం పై ఎలాంటి స్పంధ‌న లేదు.