అర్జున్ రెడ్డి లిప్ లాక్ పోస్టర్ వివాదం గంట‌కో ట్విస్ట్. సవాల్ విసురుకుంటున్న పొలిటీషియన్, డైరెక్టర్.

అర్జున్ రెడ్డి లిప్ లాక్ పోస్టర్ వివాదం ఇప్ప‌ట్లో సద్దుమణగేలా లేదు. గంట‌కో ట్విస్ట్ తీసుకుంటుంది, పొలిటీషియ‌న్ వీహెచ్‌ పోస్టర్ల చించివేతతో మొద‌లైన వివాదం...పీక్ స్టేజీకి వెళ్లింది. వీహెచ్ అర్జున్ రెడ్డి పోస్ట‌ర్ల‌ను చింపివేత‌పై హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ వీహెచ్ ని ఉద్దేశించి తాత‌య్య చిల్ అంటూ కామెంట్ చెయ్య‌డం తెలిసింది, 

అదే పోస్ట‌ర్ల చింపివేత‌పై పై రాంగోపాల్ వర్మ కూడా సెటైర్లు వేశారు. అయితే వ‌ర్మ‌ వేసిన సెటైర్లపై వి. హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్ లాక్ పోస్టర్లను వెంటనే తొలగించాలని విహెచ్ డిమాండ్ చేశారు. లిప్ లాక్ పోస్టర్లను సమర్ధిస్తూ హీరో విజయ్ దేవరకొండ ట్వీట్ చేయడంపై మండిపడ్డ వీహెచ్.. తనపై సెటైర్లు వేసిన రాంగోపాల్ వర్మకు తగిన విధంగా బుద్ధి చెబుతామని అన్నారు.

అర్జున్ రెడ్డి సినిమా పోస్ట‌ర్ పై వీహెచ్‌ సెన్సార్ బోర్డు కార్యాలయం ముందు నిరసనకు దిగారు. సెన్సార్ బోర్డు రీజినల్ ఆఫీసర్ రాజశేఖరంను కలిసి పిర్యాదు చేశారు. అర్జున్ రెడ్డి సినిమాలో ఎముందో కానీ పోస్టర్లవల్ల చాలామంది యువతీ, యువకులను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆయన పెర్కొన్నారు. వర్మ లాంటి డైరెక్టర్లవలనే సినిమా ఇండస్ట్రీ నాశనం అవుతుందని ఆయన అన్నారు. అలాంటి వారి సినిమాలను అస్స‌లు విడుద‌ల చెయ్య‌నివ్వ‌కుడ‌ద‌ని ఆయ‌న పెర్కొన్నారు.


రామ్ గోపాల్ వ‌ర్మా కూడా ఫేస్ బుక్ పేజీలో వీహెచ్ సా..ర్ నేను రేపు 9:30 ప్రసాద్ ఐ మ్యాక్స్ లో అర్జున్ రెడ్డి సినిమా చూస్తాను రండి అని అంతకు ముందు వీహెచ్ ని ఉద్దేశించి వర్మా పోస్టు చెయ్యడం గమనార్హం


మరీ రేపు చూడాలి ఇటు.. వర్మా.. అటు వీహెచ్ ఇద్దరు ఎలా స్పందిస్తారో...