ఇవాంకాకు తండ్రి ప్రశంసలు..!

First Published 29, Nov 2017, 3:59 PM IST
US president donald trump praises his daughter ivanka trump
Highlights
  • జీఈఎస్ సదస్సుకి హాజరైన ఇవాంకా
  • ఇవాంకాని ట్విట్టర్ వేదికగా అభినందించిన డోనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. తన కుమార్తె ఇవాంకా ట్రంప్ పై ప్రశంసల జల్లు కురిపించారు.  ఇవాంకా.. జీఈఎస్( గ్లోబల్ ఎంట్రపెన్యూర్ షిప్ సమ్మిట్)లో పాల్గొనేందుకు హైదరాబాద్ నగరానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సదస్సులో ఇవాంకా అదరగొట్టారు. ఇవాంక  చేసిన ఉత్తేజభరిత, స్ఫూర్తిదాయక ప్రసంగం అందర్నీ కట్టిపడేసింది. మహిళా శక్తి ఔన్నత్యాన్ని చాటిచెప్పిన తీరుకు హర్షధ్వానాలు వెల్లువెత్తాయి.

ఆమె ప్రసంగానికి ఇండియన్స్ అంతా ఫిదా అయిపోయారు. ఆమె హైదరాబాద్ పర్యటన సక్సెస్ అయ్యినందుకు ఆమె తండ్రి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఆమెను ట్విట్టర్ వేధిగా అభినందించారు. జీఈఎస్ సదస్సులో ఇవాంక మాట్లాడిన ఓ వీడియో క్లిప్ ని డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ ట్విట్టర్ లో పోస్టు చేయగా.. దానికి ట్రంప్.. గ్రేట్ వర్క్ అంటూ కామెంట్ చేశారు.

 

loader