మహిళా ప్రయాణికురాలి ముందు ఉబర్ డ్రైవర్ హస్తప్రయోగం

Uber driver allegedly masturbates before woman passenger
Highlights

మహారాష్ట్ర రాజధాని ముంబైలో జుగుప్సాకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఉబర్ డ్రైవర్ శుక్రవారంనాడు మహిళా ప్రయాణికురాలి ముందు హస్తప్రయోగం చేసుకున్నాడు.

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో జుగుప్సాకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఉబర్ డ్రైవర్ శుక్రవారంనాడు మహిళా ప్రయాణికురాలి ముందు హస్తప్రయోగం చేసుకున్నాడు. ఈ మేరకు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. 

డ్రైవర్ పై వేటు వేసినట్లు ఉబర్ సంస్థ ప్రకటించింది. మహిళ చేసిన ఫిర్యాదు మేరకు తాను క్యాబ్ లో కూర్చోగాని అకస్మాత్తుగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగినప్పుడు డ్రైవర్ అందరి ముందు హస్తప్రయోగం చేసుకున్నాడు. 

తాను వెంటనే కారు దిగిపోయి చార్జీ ఎంత అయిందని అడిగానని, అతను కూడా తిట్టుకుంటూ కారు దిగి ఏమైందని అడిగాడని, ఏమైందో తెలియదా అని తాను ప్రశ్నించానని, కేకలు వేసి నువ్వేం చేశావో అందరికీ తెలిసేలా చేయనా అని అన్నానని ఆమె వివరించింది. 

ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ పోస్టు వైరల్ అవుతోంది. నిందితుడు అత్యంత ప్రమాదకారి అనే భయంతో తాను డబ్బులు తీసి చార్జీ కన్నా ఎక్కువ ఇచ్చానని, చిల్లర కోసం కూడా నిరీక్షించలేదని చెప్పింది.

ఆ తర్వాత ఆమె అంధేరీ పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. విషయం తెలిసిన వెంటనే డ్రైవర్ ను తొలగించామని ఉబర్ అధికార ప్రతినిధి చెప్పారు. డ్రైవర్ పై గతంలో ఏ విధమైన ఆరోపణలు లేవని అన్నారు.

loader