Asianet News TeluguAsianet News Telugu

(వీడియో) జగిత్యాల దగ్గర తల్లెదుటే కొడుకును కొట్టేసిన టూవీలర్

మెరుపు వేగంతో ఢీకొట్టిన టూవీలర్

పసి బాలుడు మృతి

కరీంనగర్ జగిత్యాల రోడ్డులో గంగాధర క్రాస్ రోడ్ లో ఈ ఘటన

కన్నీరు మున్నీరైన తల్లి, అయ్యో అని కంటతడిపెట్టిన జనాలు

two wheeler hits boy right before mother in nellore today

 

అభం శుభం తెలియని ఆ పసివాడు అమ్మ, చెల్లితోపాటు రోడ్డు దాటేందుకు వచ్చి నిలబడ్డడు. అటు ఇటు చూసిండు. బండ్లు, ఆటోలు వస్తలేవనుకుండు. అప్పటి వరకు అమ్మ ఆ పసివాడిని ఒకచేత్తో, చెల్లిని ఇంకో చేత్తో పట్టుకుంది. కానీ రోడ్డు మీద బండ్లేమీ రాట్లేవనుకుండు ఆ బాలుడు. ఒక్కసారిగా అమ్మ చేయి వదిలేసి రోడ్డు దాటేందుకు ముందుకు ఉరికిండు.

అంతలోనే మెరుపు వేగంతో వచ్చిందొక బైక్. ఆ వేగంతో బాబును ఢీకొట్టడంతో చాలా దూరంలో పల్టీలు కొట్టుకుంటూ పడిపోయాడు. వెంటనే కొడుకు వద్దకు తల్లి పరిగెత్తింది. అందరూ అక్కడ గుమిగూడారు. కానీ బాబు ప్రాణాలు కాపాడలేకపోయారు. క్షణాల్లో రక్తపు మడుగులో మునిగిపోయాడు. ఆసుప్రతికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. ఈ సంఘటన కరీంనగర్ జగిత్యాల రోడ్డులోని గంగాధర క్రాస్ రోడ్డ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఆ వీడియో సిసి రికార్డులో నమోదైంది. హృదయ విదారక సంఘటన జరగడంతో చూసినోళ్లంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. అయ్యో పాపం అని బాధపడ్డవారెందరో.

Follow Us:
Download App:
  • android
  • ios