Asianet News TeluguAsianet News Telugu

ర‌న్ వే పై రెండు భారీ విమానాలు ఢీకొన్నాయి

  • రెండు విమానాలు ఢీకొన్నాయి.
  • 400 మంది ప్రయాణికులు ఉన్నారు.
  • తృటిలో తప్పిన ప్రమాదం.
Two big planes crashed

కెనడాలోని విమాన‌శ్రయంలో భారీ ప్రమాదం జ‌రిగింది.  టోరంటో అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీ కొన్నాయి. అందులో వంద‌లాది మంది ప్ర‌యాణిస్తున్నారు. ఈ రెండు విమానాలు ర‌న్ వేపై ఎదురెదురుగా వచ్చి ఢీ కొట్టాయి.

 విమాశ్ర‌యంలో పోలాండ్‌ కు చెందిన బోయింగ్‌ 787 విమానం టేకాఫ్‌ కు సిద్దంగా ఉంది. రెండ‌వ‌ది  కెనడాకు చేందిన ఎయిర్ కెన‌డా 1213 విమానం ప్ర‌యాణికుల ఎక్కారు, కానీ గంట పాటు డిలే అవ్వ‌డంతో పార్కింగ్ కు సిద్ద‌మ‌యింది. అందుకు ఇవి రెండు ఓకే ర‌న్ వే మీద‌కు వ‌చ్చాయి. అప్పుడు రెండు విమానాలు ఢీకొట్టాయి. దీంతో రెండు విమానాలు కుదుపుకులోనయ్యారు. ప్ర‌యాణికులు కూడా సీట్ల పై నుండి కింద ప‌డిపోయారు. ఏం జరిగిందో తెలియక బెంబేలెత్తిపోయారు. 

కొంత స‌మ‌యం త‌రువాత‌ రెండు విమానాలు ఢీకోట్టాయని తెలసుకున్నారు. త‌క్ష‌ణ‌మే రెండు విమానాల‌లో ఉన్న ప్ర‌యాణికులు హాడ‌విడిగా భ‌యంతో కింద‌కి దిగారు. చివ‌ర‌కి ఎవ‌రికి ఎలాంటి హానీ జ‌ర‌గ‌లేద‌ని తెల‌సుకొని ఉపిరి పీల్చుకున్నారు. రెండు విమానాల్లో 400 పైగా ప్ర‌యాణికులు ఉన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios