ట్విట్టర్ లో కొత్త ఫీచర్..!

First Published 24, Nov 2017, 4:01 PM IST
Twitter is now testing Bookmarks its save for later feature
Highlights
  • కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువస్తున్న ట్విట్టర్
  • ట్వీట్లు సేవ్ చేసుకునే వెసులుబాటు
  • త్వరలోనే వినియోగదారుల ముందుకు 

ప్రముఖ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విట్టర్.. కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ ఫీచర్ ఏంటో తెలుసా..ఇక ముందు నుంచి మనకు నచ్చిన ట్వీట్లను మనం సేవ్ చేసుకోవచ్చు. అందుకోసం ‘బుక్ మార్క్స్’ ఆప్షన్ ని అందుబాటులోకి తీసుకువస్తోంది. యూజర్ల కోరిక మేరకు ‘సేవ్‌ ఫర్‌ ల్యాటర్‌’ ఫీచర్‌ను డెవలప్‌ చేస్తున్నట్లుగత నెల్లో ట్విటర్‌ ప్రకటించింది. అయితే ఆ ఫీచర్‌కు బుక్‌మార్క్స్‌ పేరు పెడుతున్నట్లు తాజాగా వెల్లడించింది. ఈ ఆప్షన్‌తో యూజర్‌ తనకు కావాల్సిన ట్వీట్లను సేవ్‌ చేసుకుని.. తర్వాత చదువుకోవచ్చు. అంతేగాక వీటికి ప్రైవసీ కూడా ఉంటుంది. అంటే ఆ ట్వీట్లను సేవ్‌ చేసినట్లు కేవలం యూజర్‌కు మాత్రమే తెలిసేలా దీన్ని తయారుచేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ట్విటర్‌ పరీక్షిస్తోంది. త్వరలోనే దీన్ని యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.

ట్విట్టర్ ని ప్రవేశపెట్టిన తొలి రోజుల్లో.. ట్వీట్ పిరిమితి చాలా తక్కువగా ఉండేది. అయితే.. వినియోగదారుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ట్విట్టర్ ట్వీట్ పిరిమితిని పెంచింది. అంతేకాకుండా యూసర్ ఖాతా పేర్లలో అక్షరాల పరిమితిని కూడా పెంచింది. ఇప్పుడు ఈ బుక్ మార్స్క్ ఆప్షన్ ని ప్రవేశపెడుతోంది. వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ట్విట్టర్ బాగానే ప్రయత్నాలు చేస్తోంది.

loader