టీవీఎస్ కొత్తమోడల్ వస్తోంది..!

TVS Apache RR 310 to be launched on December 6
Highlights

  • భారత మార్కెట్ లోకి టీవీఎస్ కొత్త మోడల్
  • డిసెంబర్ 6వ తేదీన విడుదల చేయనున్న టీవీఎస్
  • లక్సరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూతో కలిసి టీవీఎస్ తొలిసారిగా తయారుచేసిన బైక్ ఇది.

ప్రముఖ మోటారు వాహనాల తయారీ సంస్థ టీవీఎస్.. భారత మార్కెట్ లోకి మరో కొత్తమోడల్ ప్రవేశపెడుతోంది. టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 పేరిట ఈ ద్విచక్రవాహనాన్ని విడుదల చేయనున్నారు. దీనినే అకులా 310 పేరుతో కూడా పిలుస్తారు. ఇప్పటికే చైనాలో దీనిని విడుదల చేయగా.. భారత్ లో డిసెంబర్ 6వ తేదీన విడుదల చేయనున్నారు.

భారత మార్కెట్ లో బీఎండబ్ల్యూ సహకారంతో  టీవీఎస్ విడుదల చేస్తున్న తొలి బైక్ ఇదే కావడం విశేషం. ఈ మోటారు వెహికల్ ని మొదట 2016లో నిర్వహించిన ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించారు. కాకపోతే అధికారికంగా దీనిని వచ్చే నెలలో విడుదల చేస్తున్నారు.

టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బైక్ ని.. 313సీసీ ఇంజిన్ తో, బీఎమ్ డబ్ల్యూ మోటారాడ్ తో తయారు చేశారు. బీఎండబ్ల్యూ  డెవలప్ చేసిన ఈ ఇంజిన్ ని బీఎండబ్ల్యూ జీ310ఆర్, జీ310ఎస్ లలో కూడా ఉపయోగించారు.

ఈ ద్విచక్రవాహనానికి అధికారికంగా ఇంకా పేరు ఏదీ నిర్ధారించలేదు. కాకపోతే ఇప్పటి వరకు టీవీఎస్ అపాచీ సిరిస్ లోనే దానిని విడుదల చేయనున్నారు. గతంలో టీవీఎస్ విడుదల చేసిన అపాచీ బైక్ లు విస్తృతంగా అమ్ముడైన సంగతి తెలిసిందే. బజాజ్ డామినార్ 400 బైక్ పోటీగా టీవీఎస్ ఈ ద్విచక్రవాహనాన్ని విడుదల చేస్తోంది.

loader