సెప్టెంబర్‌ 22వ తేది శుక్రవారం రాత్రి 7.00 నుంచి 8.00 గంటల నడుమ బ్రహ్మోత్సవాల అంకురార్పణ నిర్వహిస్తారు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబర్‌ 1వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం సెప్టెంబర్‌ 22వ తేది శుక్రవారం రాత్రి 7.00 నుంచి 8.00 గంటల నడుమ అంకురార్పణ నిర్వహిస్తారు. సెప్టెంబర్‌ 23వ తేది శనివారం ఉదయం విశ్వరూప సర్వదర్శనం, సాయంత్రం 5.48 నుంచి 6.00 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది.

వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. వైఖానస ఆగమాన్ని పాటించే తిరుమల మరియు ఇతర ఆలయాల్లో ఉత్సవాలకు ఒక రోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీ.

అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అదేరోజు రాత్రి బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో అంకురార్పణం (బీజవాపనం) జరుగుతుంది. అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వాహనసేవల వివరాలు :

తేది ఉదయం(9గం|| నుండి 11గం|| వరకు) రాత్రి(9గం|| నుండి 11గం|| వరకు)

23-09-2017 విశ్వరూపసర్వదర్శనం సా|| ధ్వజారోహణం (సా|| 5.48 నుంచి 6.00 వరకు),పెద్దశేషవాహనం.

24-09-2017 చిన్నశేష వాహనం హంస వాహనం

25-09-2017 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

26-09-2017 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

27-09-2017 మోహినీ అవతారం గరుడ వాహన (రా.7.30 నుండి 1.00 వరకు)

28-09-2017 హనుమంత వాహనం స్వర్ణరథం (సా.5 నుండి 7 వరకు) గజవాహనం.

29-09-2016 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

30-09-2016 రథోత్సవం (ఉ.7.00 గం||లకు) అశ్వ వాహనం

01-10-2017 చక్రస్నానం (ఉ.6 నుండి 9 వరకు) ధ్వజావరోహణం.