బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన కోన వెంకట్

బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన కోన వెంకట్

టాలీవుడ్ సినీ రచయిత కోన వెంకట్.. బాలీవుడ్ సినిమా ఛాన్స్ కొట్టేశారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించబోయే ఓ సినిమాకి కథను కోన వెంకట్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఇటీవల సల్మాన్ ఖాన్ స్వయంగా తెలియజేశారు. ఇప్పటికే కోన వెంకట్.. సల్మాన్ సినిమాకి స్క్రిప్ట్ రాసే పనిలో పడినట్లు సమాచారం.

ఆ సినిమా పేరు ‘ షేర్ ఖాన్’ గా ప్రచారం సాగుతోంది. ఈ సినిమాకి సొహైల్ ఖాన్ దర్శకత్వం వహించనున్నారు. సల్మాన్ హీరోగా నటించిన ‘భజరంగీ భాయిజాన్’ సినిమాకి కథని టాలీవుడ్ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్( రాజమౌళి వాళ్ల నాన్న) అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి సల్మాన్.. టాలీవుడ్ రచయిత వైపు చూస్తున్నారు.

కోనవెంకట్ కథ అందించిన తెలుగు సినిమా రెడీ ని హిందీలో రిమేక్ చేసింది కూడా సల్మాన్ ఖానే కావడం విశేషం. తెలుగులో రామ్, జెనీలియా జంటగా నటించగా.. హిందీలో సల్మాన్, అసీన్ జంటగా నటించారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos