శనివారం నాటి రాశిఫలాలు

First Published 23, Dec 2017, 8:04 AM IST
today saterday your horoscope
Highlights
  • ఈ రోజు మీ రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషరాశి

బంధు మిత్రుల కలయికలు ఉంటాయి. తల్లి గారి ప్రేమను కూడా గ్రహిస్తారు. భార్య సహకారంగా మసులుకోగలదు. ధన ప్రణాళికలు లాభం తెస్తాయి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.
వృషభ రాశి

పని వారి సహకారం ఉంటుంది. తలచిన పనులు పూర్తి చేస్తారు. దూర ప్రాంత వార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు అనుకున్న ఫలితాలను ఇస్తాయి. పిల్లలు మనస్సుకు తగినట్టు ప్రవర్తిస్తారు.

మిథున రాశి

 ధనానికి ఇబ్బందులు ఉంటాయి. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంత ప్రయాణ ఆలోచనలు చేస్తారు. తండ్రి గారి ఆశీర్వాదం కూడా పొందండి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. 
కర్కాటక రాశి

చేయు పనులందు ఆటంకాలు ఉంటాయి. కొత్త అవకాశాలు చేజారే సమయం. ఇంటికి సంబంధించిన పనులు బాధ్యతగా పూర్తి చేస్తారు. అధికారులు ప్రసన్నం అవుతారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

సింహ రాశి

భార్య సహకారం పూర్తిగా ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. చిన్న ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పిల్లల విషయంలో బాధ్యతగా మసులుకోవాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కన్యా రాశి

చేయు పనులందు ఆటంకాలు ఉంటాయి. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఇంటి పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తారు. పని వారి సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

తులారాశి

అనుకున్న పనులు పూర్తి చేస్తారు. పిల్లల వలన ఆనందం కలుగుతుంది. అధికారుల మన్నన పొందుతారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ముగుస్తాయి.

వృశ్చిక రాశి

కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. తల్లి గారిని ప్రేమగా చూస్తారు. దైవ దర్శన ప్రాప్తి కలదు. దూర ప్రాంత వార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలలో ధనం చేకూరుతుంది. 

ధనస్సు రాశి

దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. రుణాలు చేయవలసి వస్తుంది. చేయు పనులందు ఆటంకాలు ఉంటాయి. బంధువుల సహకారంతో వ్యాపారం బాగా సాగుతుంది.

మకర రాశి

చేయు పనులందు చిక్కులు కలవు. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. పాత మిత్రులు కలుస్తారు. పిల్లలు అనుకూలంగా మసులుతారు. 

కుంభ రాశి

మనస్సు ఆనందంగా ఉంటుంది. మంచి విందు భోజనం లభిస్తుంది. అధికారులు ప్రసన్నం అవుతారు. పని వారి సహకారం పూర్తిగా ఉంటుంది. అనుకున్నవి అన్నీ సాధిస్తారు.

మీన రాశి

ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. పిల్లల గురించి ఆలోచించాల్సిన సమయం. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. దైవ దర్శన ప్రాప్తి కలదు.
 

loader