Asianet News TeluguAsianet News Telugu

8 జనవరి సోమవారం 2018..మీ రాశిఫలాలు

  • ఈరోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
today monday jan8th your horoscope

మేషం

ఈ రోజు శారీరకంగా బాగున్నప్పటికీ, మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. పని చేయాలనే ఆసక్తి తక్కువగా ఉం టుంది. ఎక్కువగా విశ్రాంతి కోరుకుంటారు. పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. బంధువులను కలుసుకొంటారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ జీవితభాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

వృషభం

ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. దూర ప్రయాణం, ఉద్యోగంలో మార్పుకానీ ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు. దైవ దర్శనం చేసుకోవడం, ఆధ్యాత్మిక క్షేత్రాల్ని సందర్శించడం కానీ చేస్తారు.

మిథునం

ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి.

కర్కాటకం

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా బదిలీ కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్యసమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

సింహం

ఈ రోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయడానికి బద్ధకిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.

కన్య

ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలువసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులతో కలిసి వినోద కార్యక్రమాల్లో కానీ, శుభకార్యాల్లో గానీ పాల్గొంటారు.

తుల

బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా మిత్రులతో సమస్యలు వచ్చే అవకాశముంటుంది. మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్త అవసరం. పొరపాటున తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశముంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి.

వృశ్చికం

మీరు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యమైన ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి.

ధనుస్సు

ఈ రోజు కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి, వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ప్రయాణం కానీ, దైవ దర్శనం కానీ చేస్తారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మకరం

ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తుల కారణంగా లేదా నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శత్రువులమీద ఒక కన్నేసి ఉంచండి. వారి కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశముంటుంది. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభం

ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. శ్వాస సం బంధ సమస్యలు, జీర్ణకోశ సంబంధ సమస్యలు కానీ వచ్చే అవకాశముంటుంది. కీళ్లు, ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. కొత్త పనులకు అనుకూలమైన రోజు కాదు. అలాగే ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది.

మీనం

మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా మీ పిల్లలతో ఎక్కువ సమ యం గడుపుతారు. కొత్త పనులు చేపట్టడానికి అనుకూల సమ యం. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్థులకు కలిసి వస్తుంది.ఆధ్యాత్మిక క్షేత్రాల్ని సందర్శించడం కానీ చేస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios