Asianet News TeluguAsianet News Telugu

08 మే 2018 మంగళవారం మీ రాశిఫలాలు

ఫలితం దక్కుతుంది

TODAY MAY8TH YOUR HOROSCOPE

మేషం

మేషం : చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్తగా ఏదైనా పని ప్రారంభించటానికి అనువైన రోజు. గృహానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అనుకోని బహుమతి పొందుతారు. ఉద్యోగం మార్పు విషయంలో ఎదురుచూస్తున్న ఫలితం దక్కుతుంది.

వృషభం

వృషభం : మానసికంగా అశాంతిగా ఉంటారు. రోజువారీ పనులనుంచి విశ్రాంతి కోరుకుంటారు. ఏదైనా దూర ప్రదేశానికి కానీ, ఆధ్యాత్మిక కేంద్రానికి కాని వెళ్లి ప్రశాంతంగా గడపాలి అన్న ఆలోచనతో ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలమైన రోజు కాదు. ప్రయాణాల్లో కొంత ఇబ్బందికి లోనవుతారు.

మిథునం

మిథునం :ఈ రోజు ఒక సంఘటన మీ మనసు చెదిరిపోయేలా చేస్తుంది. అనవసర వివాదం కానీ, ఆర్థిక నష్టం కానీ జరిగే అవకాశముంటుంది. ముఖ్యంగా ఆవేశానికి లోను కాకుండా మీ పను లు చేసుకోవటం మంచిది. మాట విషయంలో జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు అంతగా అనువైన రోజు కాదు.

కర్కాటకం

కర్కాటకం :మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామికి కానీ, ప్రేమించిన వ్యక్తిని కానీ మీ ప్రేమను వ్యక్త పరుస్తారు. వివాహ సంబంధాల విషయంలో అనుకూలంగా ఉంటుం ది. వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి. ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. ప్రయాణాలకు అనుకూల దినం.

సింహం

సింహం : ఆర్థికంగా బాగుటుంది. రావలసిన బకాయిలు వసూలవుతాయి. వివాదాల్లో కానీ, కోర్టు కేసుల్లో కానీ విజయం సాధిస్తారు. ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. స్నేహితుల నుంచి అనుకోని సాయం అందుతుంది. లోన్ కొరకు లేదా ఆర్థిక సాయం కొర కు ఎదురుచూస్తున్న వారికి ఈ రోజు అనుకూల ఫలితం ఉంటుం ది. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.

కన్య

కన్య : మీరు ఇష్టపడిన వారికి మీ ప్రేమను వ్యక్తం చేయటానికి, స్నేహితులతో ఉన్న వివాదాలను తొలగించుకోవటానికి అనుకూల దినం. మిత్రుల నుంచి సహాయం ఆశిస్తున్నవారికి వారు అనుకున్న సాయం అందుతుంది. మీ పిల్లలకు సంబంధించి ఉన్నత విద్యావకాశాలు మెరుగవుతాయి.

తుల

తుల : పని మీద ఎక్కువగా ధ్యాస ఉండదు. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి, కుటుంబ సభ్యులతో గడపాలి అనే ఆలోచన ఉంటుంది. విద్యా , భూ, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం. భూమి లేదా వాహనం కొనుగోలు చేయదలచిన వారు ఈ రోజు తీసుకోవచ్చు. ఖర్చు అదుపులో ఉండదు

వృశ్చికం

వృశ్చికం : వ్యాపార వ్యవహారాలకు, ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం చేసే అవకాశం ఉంది. అలాగే విదేశం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవటం మంచిది.

ధనుస్సు

ధనుస్సు : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా కాకపోయే సరికి కొంత నిరాశకు లోనవుతారు. ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్త అవసరం, లేనిచో అవమానాల పాలవుతారు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనటం కాని, బాగు చేయించటం కానీ చేస్తారు.

మకరం

మకరం : ఆనందంగా గడుపుతారు. మిత్రులతో లేదా కుటుంబ సభ్యులతో విహారం చేస్తారు. దుస్తులు కానీ, మీకు సంబంధించిన వస్తువులు కానీ కొనుగోలు చేస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి సినిమా, ఇతర వినోద కార్యక్రమానికి హాజరవుతారు.

కుంభం

కుంభం :కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్న పనికిఇతరులపై ఆధారపడటం కానీ, ఇతరుల సాయం తీసుకోవటం కానీ చేస్తారు. ప్ర యాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది. అనవసర ఖర్చులుంటాయి.

మీనం

మీనం : ఈ రోజు ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు అనుకూలం గా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు గడిస్తారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు అలాగే కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి.

Follow Us:
Download App:
  • android
  • ios