Asianet News TeluguAsianet News Telugu

04 మే 2018 శుక్రవారం మీ రాశిఫలాలు

లాభాలు గడిస్తారు

today may 4th your horoscope

మేషం

మేషం : మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. రోజువారీ పనులనుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఏదై నా దూర ప్రదేశానికి కానీ, ఆధ్యాత్మిక కేంద్రానికి కాని వెళ్లి ప్ర శాంతంగా గడపాలి అన్న ఆలోచనను కలిగి ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలమైన రోజు కాదు.

వృషభం

వృషభం : ఈ రోజు ఒక సంఘటన మీ మనసు చెదిరిపోయేలా చే స్తుం ది. అనవసర వివాదం కానీ, ఆర్థిక నష్టం కానీ జరిగే అవకాశ ముంటుంది. ఆవేశానికి లోను కాకుండా మీ పనులు చేసుకోవటం మంచిది. మాట విషయంలో జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు అంతగా అనువైన రోజు కాదు.

మిథునం

మిథునం : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవి త భాగస్వామికి కానీ, మీరు ప్రేమించిన వ్యక్తిని కానీ మీ ప్రేమను వ్యక్తపరుస్తారు. అలాగే వివాహ సంబంధాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు కలి సి వస్తాయి. ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు.

కర్కాటకం

కర్కాటకం : చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. జీవిత భాగస్వామి నుంచి అనుకోని సహా యం అందుతుంది. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. రాదనుకున్న డబ్బు తిరిగి వస్తుంది. పోటీల్లో, వివాదాల్లో విజ యం సాధిస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

సింహం

సింహం : ఇష్టపడిన వారికి మీ ప్రేమను వ్యక్తం చేయటానికి, స్నేహితులతో ఉన్న వివాదాలను తొలగించుకోవటానికి అనుకూల దినం. మిత్రుల నుంచి సహా యం ఆశిస్తున్నవారికి వారు అనుకున్న సాయం అందుతుంది. మీ పిల్లలకు ఉన్నత విద్యావకాశాలు మెరుగవుతాయి.

కన్య

కన్య : ఈ రోజు పని మీద ఎక్కువగా ధ్యాస ఉండదు. ఇంట్లో విశ్రాం తి తీసుకోవాలి, కుటుంబ సభ్యులతో గడపాలి అనే ఆలోచన అధికంగా ఉంటుంది. విద్యా సంబంధ వ్యవహారాలకు, భూ, గృహ సం బంధ వ్యవహారాలకు అనుకూల దినం. భూమి లేదా వాహనం కొనుగోలు చేయదలచిన వారు ఈ రోజు తీసుకోవచ్చు.

తుల

తుల : ఈ రోజు వ్యాపార వ్యవహారాలకు, ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం చేసే అవకాశం ఉంది. అలాగే విదేశాల నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అం దుకుంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవటం మంచిది.

వృశ్చికం

వృశ్చికం : ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా కాకపోయే సరికి కొంత నిరాశకు లోనవుతారు. ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్త అవసరం, లేనిచో అవమానాల పాలవుతారు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొన టం కానీ, బాగు చేయించటం కానీ చేస్తారు.

ధనుస్సు

ధనుస్సు : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవటం కానీ, నూతన దుస్తులు కొనుగోలు చేయటం కానీ చేస్తారు. కొన్ని విషయా ల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉండటం మంచిది.

మకరం

మకరం : కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్న పనికి అయినా ఇతరులపై ఆధారపడటం కానీ, ఇతరుల సాయం తీసుకోవటం కానీ చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిపాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. అనవసర ఖర్చులుంటాయి.

కుంభం

కుంభం : ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు లాభాలు గడిస్తారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి.

మీనం

మీనం : మీరు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో అనుకూల మార్పు ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. మీ పై అధికారులనుంచి అనుకోని బహుమతి అందుకుంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ సంతానం కారణంగా మీరు ఆనందాన్ని, గుర్తింపును పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ఆచి, తూచి అడుగేయండి.

Follow Us:
Download App:
  • android
  • ios