Asianet News TeluguAsianet News Telugu

15 మే 2018 మంగళవారం మీ రాశిఫలాలు

అనుకోని శుభపరిణామాలు ఏర్పడతాయి

today may 15th your horoscope

మేషం

మేషం : ఈరోజు కొంత బద్ధకంగా గడుపుతారు. ఏ పని చేయటానికి ముందుకురారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. మీ మిత్రులు, దగ్గరి బంధువులతో కానీ వివాదం జరుగటం, వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవటం జరుగవచ్చు. భూసంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు. మీ తల్లి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

వృషభం

వృషభం : ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మిత్రుల నుంచి అనుకోని సాయం అందుకుంటారు. మీ స్నేహం బలపడుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకోని శుభపరిణామాలు ఏర్పడతాయి. పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు.

మిథునం

మిథునం : ఈ రోజు వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూల సమయం. పై అధికారులను కలువటానికి అలాగే ముఖ్యమైన ఒప్పందాలకు కూడా అనుకూలించే దినం. అనుకోని బహుమతులు కానీ, ప్రశంసలు కానీ పొందుతారు. మీ మిత్రులు, బంధువుల సహాయం అందుకుంటారు. అనుకోని వ్యక్తులను కలుసుకుంటారు.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు రోజువారీ పనుల నుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు. గురువులను లేదా ఆధ్యాత్మిక వేత్తలను కలుస్తారు. ప్రయాణంలో అడ్డంకుల కారణంగా విసుగుకు లోనవుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనటం కానీ, ఇల్లు సర్దటం కానీ చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

సింహం

సింహం : ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. ఒక సంఘటన కారణంగా మీ మనసు చెదురుతుంది. ఆర్థిక నష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళన మొదలైన భయం ఈరోజు సూచించబడ్డాయి. మీ ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. శివున్ని పూజించండి.

కన్య

కన్య.. ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవటానికి, ఒప్పందాలను, అంగీకారాలను కుదుర్చుకోవటానికి అనుకూల దినం. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. మీ ప్రేమను, ఆప్యాయతను వ్యక్తం చేయటానికి అనువైన దినం. పిల్లల ఆరోగ్యం, విద్య విషయంలో కొంత ఆందోళన చెందుతారు.

తుల

తుల : ఈ రోజు భూమి సంబంధ వివాదాలు పరిష్కరించుకోవటానికి అనుకూల దినం. మీ మాట నెగ్గుతుంది. అనుకూల ఫలితం పొందుతారు. జీవిత భాగస్వామి అనారోగ్యం కొంత ఆందోళనకు కారణమవుతుంది. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లు చేస్తారు. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి.

వృశ్చికం

వృశ్చికం : మీ పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారికి సంబంధించిన పనులు పూర్తి చేయగలుగుతారు. అలాగే మీ ప్రేమను మీరు ప్రేమించిన వ్యక్తికి చెప్పటానికి అనుకూలం. మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ, తెలియని చిన్న ఆందోళన మనసులో ఉంటుంది. కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న వారు విజయం సాధిస్తారు

ధనుస్సు

ధనుస్సు : ఈ రోజు మీ ఇంటికి సంబంధించిన పనులు చేయటానికి, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. చదువు పట్ల కొంత నిరాసక్తత ఉంటుంది. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణంలో కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది.

మకరం

మకరం : ఈరోజు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది. మీరిచ్చే సలహాలు ఎదుటివారికి లాభిస్తాయి. మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

కుంభం

కుంభం : ఈరోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. పాతబాకీలు వసూలైనప్పటికీ, అందుకు తగిన ఖర్చుపైన పడటంతో వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది. పెట్టుబడులకు, వ్యాపార లావాదేవీలకు అనువైన రోజు కాదు.ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. బంధువుల కారణంగా కూడా డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది

మీనం

మీనం : ఈ రోజు ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగం విషయంలో అనుకూల మార్పులు కానీ, వివాదాల్లో విజయం సాధించటం కానీ జరుగుతుంది. మంచి రుచికరమైన ఆహారం ఆస్వాదిస్తారు. దుస్తులు లేదా పరిమళ ద్రవ్యాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios