Asianet News TeluguAsianet News Telugu

11 మార్చి 2018 ఆదివారం మీ రాశిఫలాలు

  • ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
today march11th your horoscope

మేషం

ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామికి కానీ, మీరు ప్రేమించిన వ్యక్తిని కానీ మీ ప్రేమను వ్యక్తపరుస్తారు. అలాగే వివాహ సంబంధాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి.

వృషభం

ఈ రోజు ఆర్థికంగా బాగుంటుంది. రావలసిన బకాయిలు వసూలవుతాయి. వివాదాల్లో కానీ, కోర్టు కేసుల్లో కానీ విజయం సాధిస్తారు. ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. అలాగే స్నేహితుల నుంచి అనుకోని సాయం అందుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.

మిథునం

ఈ రోజు మీరు ఇష్టపడిన వారికి మీ ప్రేమను వ్యక్తం చేయడానికి, స్నేహితులతో ఉన్న వివాదాలను తొలగించుకోవడానికి అనుకూల దినం. అలాగే మిత్రుల నుంచి సాయం ఆశిస్తున్నవారికి వారు అనుకున్న సాయం అందుతుంది. సంతానం గురించి ఎదురుచూస్తున్న వారికి అనుకూల ఫలితం దక్కుతుంది.

కర్కాటకం

ఈరోజు పని మీద ఎక్కువగా ధ్యాస ఉండదు. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి, కుటుంబ సభ్యులతో గడపాలి అనే ఆలోచన అధికంగా ఉంటుంది. విద్యా సంబంధ వ్యవహారాలకు, భూ, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం. మీ తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

సింహం

ఈ రోజు వ్యాపార వ్యవహారాలకు, ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం చేసే అవకాశం ఉంది. అలాగే విదేశం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం మంచిది. ఉద్యోగంలో మార్పు, బదిలీ కానీ ఉంటుంది.

కన్య

ఈరోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా కాకపోయే సరికి కొంత నిరాశకు లోనవుతారు. ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగత్త అవసరం, లేనిచో అవమానాల పాలవుతారు.

తుల

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవడం కానీ, నూతన వస్ర్తాలు కొనుగోలు చేయడం చేస్తారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉండటం మంచిది. ఆరోగ్యం మెరుగవుతుంది.

వృశ్చికం

ఈ రోజు కొంత బద్ధకంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది. అనవసర ఖర్చులుంటాయి.

ధనుస్సు :

ఈరోజు ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు గడిస్తారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు.అలాగే కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి.

మకరం

ఈరోజు మీరు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో అనుకూల మార్పు ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ సంతానం కారణంగా మీరు ఆనందాన్ని, గుర్తింపును పొందుతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

కుంభం

ఈరోజు మీరు రోజువారీ కార్యక్రమాల నుంచి విశ్రాంతిని కోరుకుంటారు. ఒకే రకమైన జీవన విధానంలో కొంత మార్పు సాధించాలన్న ఆలోచన కలిగి ఉంటారు. అనుకోని ప్రయాణం, కొత్త వ్యక్తులను కలుసుకోవడం జరుగుతుంది. మానసికంగా ఏదో తెలియని అలజడిని, వెలితిని కలిగి ఉంటారు. ఉద్యోగంలో, వ్యాపారంలో కానీ మార్పు కోరుకుంటారు

మీనం

ఈరోజు మానసికంగా కొంత అశాంతితో ఉంటారు. అనుకోని అవమానం, భయం కానీ ఎదురవుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన రోజు కాదు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. అనుకోని విషయాలపై ఖర్చు చేయాల్సి వస్తుంది. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టడం మంచిది.

 

Follow Us:
Download App:
  • android
  • ios