Asianet News TeluguAsianet News Telugu

29 మార్చి 2018 గురువారం మీ రాశిఫలాలు

అనుకూల ఫలితాన్ని ఇస్తాయి
today march 29th your horoscope

మేషం

మేషం : మీ పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారికి సంబంధించిన పనులు పూర్తి చేయగలుగుతారు. అలాగే మీ ప్రేమను మీరు ప్రేమించిన వ్యక్తికి చెప్పటానికి అనుకూల దినం. మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ, తెలియని చిన్న ఆందోళన మనసులో ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచకోవటం మంచిది.

వృషభం

వృషభం : ఈరోజు మీ ఇంటికి సంబంధించిన పనులు చేయటానికి, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే కొంత జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. పయాణంలో కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది.

మిథునం

మిథునం : చేపట్టిన పనులు విజయంవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. మానసికంగా కొంత ఆందోళన ఉన్నప్పటికీ, మీ స్నేహితులు లేదా బంధువుల కారణంగా అది తొలగిపోతుంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. చాలాకాలంగా వాయిదా పడుతున్న పనులు తిరిగి పారంభమవుతాయి.

కర్కాటకం

కర్కాటకం: ఈరోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. పాతబాకీలు వసూలయినప్పటికీ, అందుకు తగిన ఖర్చుపైన పడటంతో వచ్చిన డబ్బు పోతుంది. వ్యాపార లావాదేవీలకు అనువైన రోజుకాదు. ఇంటికి సంబంధించి ఏదైన వస్తువు కొనుగోలు చేస్తారు. బంధువుల కారణంగా డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది.

సింహం

సింహం : ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. రుచికరమైన ఆహారం లభిస్తుంది. మిత్రులు, బంధువులతో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు. అనుకున్న పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు. అనుకోని ధనలాభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయసహకారాలు అందుకుంటారు.

కన్య

కన్య : ఈరోజు ఏ పని చేయటానికి ముందుకురారు. దానికి కారణంగా కుటుంబ సభ్యుల కోపానికి గురవుతారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. మీ మిత్రులతో కానీ, దగ్గరి బంధువులతో కాని వివాదం జరగటం, వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవటం జరగవచ్చు. భూ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు.

తుల

తుల : ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ మిత్రులతో, బంధువులతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. సంబంధాలు మెరుగవుతాయి. వృత్తిలో అనుకోని పశంస కాని, గుర్తింపు కాని లభిస్తుంది. ఆర్థికస్థితి మెరుగవుతుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

వృశ్చికం

వృశ్చికం : ఈరోజు వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూల సమయం. పైఅధికారులను కలవటానికి అలాగే ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలించే దినం. అనుకోని బహుమతులు కాని, ప్రశంసలు కాని పొందుతారు. మీ మిత్రులు లేదా బంధువుల సహాయం అందుకుంటారు. అనుకోని వ్యక్తులను కలుసుకుంటారు.

ధనుస్సు :

ధనుస్సు : ఈ రోజు రోజువారీ పనుల నుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఆథ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు. గురువులను లేదా ఆథ్యాత్మికవేత్తలను కలుస్తారు. ప్రయాణంలో అడ్డంకుల కారణంగా విసుగుకు లోనవుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనటం కానీ, ఇల్లు సర్దటం కానీ చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

మకరం

మకరం : ఈరోజు మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. ఒక సంఘటన కారణంగా మీ మనసు చెదురుతుంది. ఆర్థిక నష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళన మొదలైన భయం ఈరోజు సూచించబడ్డాయి. మీ ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. శివున్ని పూజించండి.

కుంభం

కుంభం : ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవటానికి, ఒప్పందాలను, అంగీకారాలను కుదుర్చుకోవటానికి అనుకూల దినం. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. మీ ప్రేమను, ఆప్యాయతను వ్యక్తం చేయటానికి అనువైన దినం. పిల్లల ఆరోగ్యం విషయం, విద్య విషయం కొంత ఆందోళన చెందుతారు.

మీనం

మీనం : ఈ రోజు వివాదాలు పరిష్కరించుకోవటానికి ఒప్పందాలు చేసుకోవటానికి అనుకూల దినం. మీ మాట నెగ్గుతుంది. అనుకూల ఫలితం పొందుతారు. ఆర్థిక లాభాలుంటాయి. జీవిత భాగస్వామి అనారోగ్యం కొంత ఆందోళనకు కారణమవుతుంది. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లు చేస్తారు. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి.

Follow Us:
Download App:
  • android
  • ios