నేటి (శుక్రవారం) రాశిఫలాలు

today friday your horoscope
Highlights

  • ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషరాశి..

భార్య సహకారంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ప్రణాళికలు వేస్తారు. తండ్రి ఆశీర్వాదం పొందుతారు. పిల్లల ప్రవర్తన మీకు ఆనందాన్ని కలుగచేస్తుంది. భూ సంబంధమైన పనులకు అనుకూలమైన రోజు.
వృషభ రాశి: 

కింద పని వారి సహాయ సహకారాలు ఉంటాయి. దూరపు బంధువుల వార్తలు వింటారు. పిల్లలు వారి పని వారు శ్రద్ధగా పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
మిథున రాశి:

 కొత్త అవకాశాలు చేజారకుండా ప్రయత్నం చేయాలి. చేయు పనులందు ఆటంకాలు ఉన్నాయి. ధనానికి ఇబ్బంది ఉంటుంది. పిల్లలతో షికారు చేస్తారు. వృత్తి వ్యాపారాలు పూర్తి చేస్తారు.

కర్కాటక రాశి:

ఇంటి పనులు శ్రద్ధగా పూర్తి చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేయటానికి భార్య సహకారం అవసరమవుతుంది. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. సోదరుల సహకారం లభించగలదు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

సింహ రాశి:

దైవ దర్శన ప్రాప్తి కలదు. చిన్న ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పిల్లల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలు చికాకును కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు అనుకున్న ఫలితాన్ని అందిస్తాయి.

కన్యా రాశి : 

పిల్లల భవిష్యత్తుపై ప్రణాళికలు వేస్తారు. ధన ప్రణాళికలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పని వారి సహకారం ఉండగలదు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

తులా రాశి: 

అనుకున్న పనులను పూర్తి చేస్తారు. భార్య సహకారం పూర్తిగా ఉంటుంది. సోదరుల మనసు తెలిసి మసులుకుంటారు. తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటారు. వారి అవసరాలు తీరుస్తారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.
వృశ్చిక రాశి:
దగ్గరి ప్రయాణాలు చేస్తారు. దూర ప్రయాణపు వార్తలు వింటారు. దైవ దర్శన ప్రాప్తి కలదు. అవసరానికి ధనం చేకూరుతుంది. వృత్తి వ్యాపారాలకు ధనం సమకూరుతుంది.

ధనూ రాశి:

 తలచిన పనులు నెరవేరతాయి. ధన ప్రణాళికలు లాభిస్తాయి. మిత్రుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

మకర రాశి: 

ఈ రోజు ఆనందంగా గడుస్తుంది. అనుకున్నవి పూర్తి చేస్తారు. మంచి భోజనం లభిస్తుంది. భార్య అనుకూలంగా మసలగలదు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి

కుంభ రాశి: 

ఆధ్యాత్మిక ప్రసంగాలు వింటారు. బంధు మిత్రుల కలయికలు ఉంటాయి. పని వారి సహకారం ఉంటుంది. భూ సంబంధమైన పనులకు శుభమైన రోజు. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి.
మీన రాశి

చేయు పనులందు అడ్డంకులు ఉంటాయి. బంధు మిత్రులను కలుసుకుంటారు. దైవ దర్శన ప్రాప్తి కలదు. భార్య సహకారంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాధ్యతగా చేయవలసి ఉంటుంది.

 

loader