Asianet News TeluguAsianet News Telugu

ఫిబ్రవరి 3 శనివారం 2018..మీ రాశి ఫలాలు

  • ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
today feb3rd your horoscope

మేషం

మేషం : మీ పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారికి సంబంధించిన పనులు పూర్తి చేయగలుగుతారు. మీ ప్రేమను మీరు ప్రే మించిన వ్యక్తికి చెప్పటానికి అనుకూలం. మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ, చిన్న ఆందోళన మనసులో ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది.

వృషభం

వృషభం: గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలంగా ఉం టుంది. ఈ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. మా నసికంగా కొంత ఆందోళన కానీ, పరాకుగా కాని ఉంటుంది. చదువు పట్ల కొంత నిరాసక్తత ఉంటుంది. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. సంతానం కారణంగా ఆనందం పొందుతారు.

మిథునం

మిథునం : మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. బంధువులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భావోద్వేగా లను అదుపులో ఉంచుకోవ టం మంచిది. భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది. భూ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు.

కర్కాటకం

కర్కాటకం : ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పాతబాకీలు వసూలయినప్పటికీ, అందుకు తగిన ఖర్చుపైన పడటంతో వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది. పెట్టుబడులకు, వ్యాపార లావాదేవీలకు అనువైన రోజు కాదు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. అనుకోని వ్యక్తులను కలుసుకుంటారు.

సింహం

సింహం : రుచికరమైన ఆహారం లభిస్తుంది. మిత్రులు, బంధువులతో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు. అనుకున్న పను లు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా అనుకూలిస్తుంది. అనుకోని ధనలాభం కలుగుతుంది. కు టుంబ సభ్యుల సహాయసహకారాలు అందుకుంటారు.

కన్య

కన్య : ఈ రోజు కొంత బద్ధకంగా గడుపుతారు. ఏ పని చేయటాని కి ముందుకురారు. దానికి కారణంగా కుటుంబ సభ్యుల కోపానికి గురవుతారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. మీ మిత్రులతో కానీ, దగ్గరి బంధువులతో కాని వివాదం జరగటం లేదా వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవటం జరగవచ్చు.

తుల

తుల : మిత్రుల నుంచి అనుకోని సాయం అందుకుంటారు. మీ స్నేహం బలపడుతుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకోని శుభపరిణామాలు ఏర్పడతాయి. పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు.

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూల సమయం. పై అధికారులను కలవటానికి అలాగే ముఖ్యమైన ఒప్పందాలకు కూడా అనుకూలించే దినం. అనుకోని బహుమతులు కాని, ప్రశంసలు కాని పొందుతారు. మీ మిత్రులు లేదా బంధువుల సహాయం అందుకుంటారు.

ధనుస్సు :

రోజువారీ పనులనుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు. గురువులను లేదా ఆధ్యాత్మిక వేత్తలను కలుస్తారు. ప్రయాణంలో అడ్డంకుల కారణంగా విసుగుకు లోనవుతారు. ఇంట్లోకి కొత్తవస్తువులు కొనటం కానీ, ఇల్లు సర్దటం కానీ చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

మకరం

మకరం : ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. ఒక సంఘటన కారణంగా మీ మనసు చెదురుతుంది. ఆర్థిక నష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు ఈ రోజు సూచించబడ్డాయి. మీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. శివున్ని పూజించండి. మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

కుంభం

కుంభం : ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవటానికి, ఒప్పందాలను కుదుర్చుకోవటానికి అనుకూల దినం. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. మీ ప్రేమను, ఆప్యాయతను వ్యక్తం చేయటానికి అనువైన దినం. పిల్లల ఆ రోగ్య, విద్యా విషయంలో కొంత ఆందోళన చెందుతారు.

మీనం

మీనం : భూమి సంబంధ వివాదాలు పరిష్కరించుకోవటానికి అనుకూల దినం. మీ మాట నెగ్గుతుంది. అనుకూల ఫలితం పొందుతారు. ఆర్థిక లాభాలుంటాయి. జీవిత భాగస్వామి అనారోగ్యం కొంత ఆం దోళనకు కారణమవుతుంది. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లు చేస్తారు. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి.

Follow Us:
Download App:
  • android
  • ios