Asianet News TeluguAsianet News Telugu

ఏప్రిల్ 19, 2018 గురువారం మీ రాశిఫలాలు

విదేశీ ప్రయాణంకు సంబంధించిన ఒక ముఖ్య సమాచారం తెలుస్తుంది

today april19th your horoscope

మేషం

మేషం : ఈ రోజు స్నేహితులు లేదా బంధువులను కలుసుకుంటారు. కొత్త స్నేహాలు పరిచయాలు ఏర్పడుతాయి. ఖర్చులు ఎక్కువగా ఉం టాయి. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన కానీ, ప్రయాణం కానీ చేస్తారు. విదేశీ ప్రయాణంకు సంబంధించిన ఒక ముఖ్య సమాచారం తెలుస్తుంది. తలపెట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు.

వృషభం

వృషభం :ఈ రోజు వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయడానికి అనుకూల సమయం. పై అధికారులను కలువడానికి అలాగే ముఖ్యమైన ఒప్పందాలకు కూడా అనుకూలించే దినం. అనుకోని బహుమతులు కానీ, ప్రశంసలు కానీ పొందుతారు. మీ మిత్రులు లేదా బంధువుల సహాయం అందుకుంటారు.

మిథునం

మిథునం : ఈ రోజు రోజువారీ పనులనుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు. గురువులను లేదా ఆధ్యాత్మిక వేత్తలను కలుస్తారు. ప్రయాణంలో అడ్డంకుల కారణంగా విసుగుకు లోనవుతారు. ఇంట్లోకి కొత్తవస్తువులు కొనడం కానీ, ఇల్లు సర్థడం కానీ చేస్తారు.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనతో ఉంటా రు. ఒక సంఘటన కారణంగా మీ మనసు చెదురుతుంది. ఆర్థిక నష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళన మొదలైన భయం ఈ రోజు సూచించబడ్డాయి. మీ ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. శివున్ని పూజించండి.

సింహం

సింహం : ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవడానికి, ఒప్పందాలను, అంగీకారాలను కుదుర్చుకోవడానికి అనుకూల దినం. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. మీ ప్రేమను, ఆప్యాయతను వ్యక్తం చేయడానికి అనువైన దినం. పిల్లల ఆరోగ్య విషయంగా కొంత ఆందోళన చెందుతారు.

కన్య

కన్య : వివాదాలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా భూ సంబంధ వివాదాలు పరిష్కరించుకోవడానికి అనుకూల దినం. మీ మాట నెగ్గుతుంది. అనుకూల ఫలితం పొందుతారు. ఆర్థిక లాభాలుంటాయి. జీవిత భాగస్వామి అనారోగ్యం కొంత ఆందోళనకు కారణమవుతుంది. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లు చేస్తారు.

తుల

తుల : మీ పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారికి సంబంధించిన పనులు పూర్తి చేయగలుగుతారు. అలాగే మీ ప్రేమను మీరు ప్రేమించిన వ్యక్తికి చెప్పడానికి అనుకూల దినం. మానసికంగా ఉ త్సాహంగా ఉన్నప్పటికీ, తెలియని చిన్న ఆందోళన మనసులో ఉం టుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది.

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు ఇంట్లో ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడతా రు. సెలవైనప్పటికీ ఇంట్లో కుటుంబ సభ్యులతో గడుపాలని కోరుకుంటారు. గృహసంబంధ వ్యవహారాలకు అనుకూల దినం. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. బంధువులను కలుసుకుంటారు. రావలసిన డబ్బు చేతికందుతుంది.

ధనుస్సు :

ధనుస్సు : ఈ రోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. షాపింగ్ చేయడం గానీ, మిత్రులను కలువడం గానీ చేస్తారు. అలాగే వాహన కొనుగోలు గానీ, రిపేర్ చేయించడం గానీ చేస్తారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. అత్యుత్సాహం కారణంగా అనుకోని గొడవల్లో ఇరుక్కునే అవకాశముంటుంది.

మకరం

మకరం : ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. పాతబాకీలు వసూలయినప్పటికీ, అందుకు తగిన ఖర్చుపైన పడటంతో వచ్చిన డబ్బు పోతుంది. పెట్టుబడులకు, వ్యాపార లావాదేవీలకు అనువైన రోజు కాదు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తు వు కొనుగోలు చేస్తారు.

కుంభం

కుంభం : మీకు అనుకూలంగా ఉంటుంది. రుచి కరమైన ఆహారం లభిస్తుంది. మిత్రులు, బంధువులతో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు. అనుకున్న పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా అనుకూలిస్తుంది. అనుకోని ధనలాభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయసహాకారాలు ఉంటాయి.

మీనం

మీనం : కొంత బద్ధకంగా గడుపుతారు. ఏ పని చేయడానికి ముందుకురారు. దానికి కారణంగా కుటుంబ సభ్యుల కోపానికి గురవుతారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. మీ మిత్రులతో గానీ, దగ్గరి బంధువులతో గానీ వివాదం జరుగడం లేదా వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం జరుగవచ్చు. భూ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం.

Follow Us:
Download App:
  • android
  • ios