ఏప్రిల్ 16, 2018 సోమవారం మీ రాశిఫలాలు

First Published 16, Apr 2018, 9:45 AM IST
today april16th your horoscope
Highlights
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

మేషం

మేషం : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవడం కానీ, నూతన వస్ర్తాలు కొనుగోలు చేయడం కానీ చేస్తారు. కొన్ని విషయా ల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉండటం మంచిది. మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సహాయం లభిస్తుంది.

వృషభం

వృషభం : ఈ రోజు కొంత బద్దకంగా ఉంటుంది. చిన్న పనికి అయినా ఇతరులపై ఆధారపడటం కానీ, ఇతరుల సాయం తీసుకోవడం కానీ చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది.

మిథునం

మిథునం : ఈ రోజు ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభా లు గడిస్తారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు .అలాగే కొత్త స్నేహా లు, పరిచయాలు ఏర్పడతాయి.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు మీరు కొనాలనుకున్న లేదా పొందాలనుకున్న వస్తువులు మీ చేతికి వస్తాయి. ఉద్యోగ విషయంలో అనుకోని విజయం, ప్రశంస కానీ పొందుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొలుగోలు చేస్తారు. చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా నిరుత్సాహ పడకుండా పని చేస్తే విజయం సాధిస్తారు.

సింహం

సింహం : ఈ రోజు మీరు రోజువారీ కార్యక్రమాల నుంచి విశ్రాంతిని కోరుకుంటారు. ఒకే రకమైన జీవన విధానంలో కొంత మార్పు సాధించాలన్న ఆలోచన కలిగి ఉంటారు. అనుకోని ప్ర యాణం, కొత్త వ్యక్తులను కలుసుకోవడం జరుగుతుంది. మా నసికంగా ఏదో తెలియని అలజడిని, వెలితిని కలిగి ఉంటారు.

కన్య

కన్య : ఈ రోజు మానసికంగా కొంత అశాంతితో ఉంటారు. అనుకోని అవమానం కానీ, భయం కానీ ఎదురవుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన రోజు కాదు. కుటుంబ సభ్యుల అనారోగ్యం కూడా మీ ఆందోళనకు కారణం కావొచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం.

తుల

తుల : వివాహ సంబంధ వ్యవహారాలకు, ఒప్పందాలకు అనుకూల దినం. మీ మనసులోని భావాలను మీ జీవితభాగస్వామికి వ్యక్తం చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి సినిమా లేదా ఇతర వినోద కార్యక్రమాలకు వెళతారు. బంధువులతో లేదా మిత్రులతో ఉన్న గొడవలు సమసిపోతాయి.

వృశ్చికం

వృశ్చికం : ఆర్థికంగా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రావలసిన పాత బకాయిలు రావడం, లోన్ రావడం కానీ జరుగుతుంది. ఉద్యోగం విషయంలో ఎదురు చూస్తున్న వారికి కొంత అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాపార విషయాలకు కొంత సామాన్యంగా ఉంటుంది.

ధనుస్సు :

ధనుస్సు : ఈ రోజు ప్రేమను లేదా మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి అనుకూలంగా ఉంటుంది. మీ సంతానం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు, ఆర్థిక లావాదేవీలకు అంతగా అనుకూలమైన రోజు కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పోటీ పరీక్షలు రాసే వారు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది.

మకరం

మకరం : ఈ రోజు గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలమైన రోజు. ఇల్లు కొనడం లేదా నిర్మాణ సంబంధ పనులు, ఒప్పందాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే వాహనం కొనుగోలు చేస్తారు. మిత్రుల, బంధువుల సహాయం అందుకుంటారు. ఇట్లో విశ్రాంతిగా ఉండటానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు.

కుంభం

కుంభం : ఈ రోజు మీ వృత్తికి సంబంధించిన ప్రయాణం కానీ, అనుకోని మార్పు కానీ ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయ త్నం చేస్తున్న వారికి ఈ రోజు ఉద్యోగానికి సంబంధించి మంచి సమాచారం అందుకుంటారు. కొత్త బట్టలు కానీ, వస్తువులు కానీ కొనుగోలు చేస్తారు.

మీనం

మీనం : ఈ రోజు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రావలసిన డబ్బులు వచ్చినప్పటికీ, మళ్లీ ఖర్చు రూపంలో వెళ్లిపోతాయి. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ విషయంలో కొంత జాగ్రత్త అవసరం. దాని కారణంగా మీకు కొంత అవమానం, వ్యతిరేకత కానీ ఏర్పడుతుంది.

loader