Asianet News TeluguAsianet News Telugu

ఏప్రిల్ 15, 2018 ఆదివారం మీ రాశిఫలాలు

శుభపరిణామాలు కలుగుతాయి
today april15th your horoscope

మేషం

మేషం : కొంత బద్ధకంగా గడుపుతారు. ఏ పని ముందుకు సాగదు. దీంతో కుటుంబ సభ్యుల కోపానికి గురవుతారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. మిత్రులు, దగ్గరి బంధువులతో వివాదాలు లేదా వారు అపార్థం చేసుకోవడం జరగవచ్చు. భూ సంబంధ వ్యవహారాలకు అనుకూలం కాదు.

వృషభం

వృషభం : అనుకూలంగా ఉంటుంది. మిత్రుల నుంచి అనుకోని సాయం అందుకుంటారు. స్నేహం బలపడుతుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకోని శుభపరిణామాలు కలుగుతాయి. పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు.

మిథునం

మిథునం : వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయడానికి అనుకూల సమయం. పై అధికారులను కలవడానికి అలాగే ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలం. అనుకోని బహుమతులు , ప్రశంసలు కానీ పొందుతారు. మిత్రులు లేదా బంధువుల సాయంం అందుకుంటారు. అనుకోని వ్యక్తులను కలుసుకుంటారు.

కర్కాటకం

కర్కాటకం : రోజువారీ పనుల నుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు. గురువులను లేదా ఆధ్యాత్మిక వేత్తలను కలుస్తారు. ప్రయాణంలో అడ్డంకులతో విసుగు చెందుతారు. ఇంట్లోకి కొత్తవస్తువులు కొనడం, ఇల్లు సర్దడం కానీ చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

సింహం

సింహం : మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. ఒక సంఘటన వల్ల మీ మనసు చెదురుతుంది. ఆర్థిక నష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళన మొదలైన భయాలు కలగవచ్చు. ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. శివుడిని పూజించండి.

కన్య

కన్య : ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవడానికి, ఒప్పందాలు, అంగీకారాలు కుదుర్చుకోవడానికి అనుకూలం. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. ప్రేమను, ఆప్యాయతను వ్యక్తం చేయడానికి అనుకూలమైన రోజు. పిల్లల ఆరోగ్యం లేదా విద్యా విషయంగా కొంత ఆందోళన చెందుతారు.

తుల

తుల : వివాదాలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా భూ సంబంధ వివాదాలు పరిష్కరించుకోవడానికి అనుకూలం. మీ మాట నెగ్గుతుంది. అనుకూల ఫలితం పొందుతారు. ఆర్థిక లాభాలుంటాయి. జీవిత భాగస్వామి అనారోగ్యం కొంత ఆందోళనకు దారితీస్తుంది. గృహ, వాహన కొనుగోళ్లు చేస్తారు.

వృశ్చికం

వృశ్చికం : పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారికి సంబంధించిన పనులు పూర్తి చేయగలుగుతారు. ప్రేమను వ్యక్తం చేయడానికి అనుకూలమైన రోజు. మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ, తెలియని చిన్న ఆందోళన మనసులో ఉంటుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది.

ధనుస్సు :

ధనుస్సు : ఇంటికి సంబంధించిన పనులు చేయడానికి, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలం. అయితే ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మానసికంగా కొంత ఆందోళన, చికాగుగా ఉంటుంది. చదువు పట్ల కొంత నిరాసక్తత. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.

మకరం

మకరం : మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. బంధువులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అత్యుత్సాహానికి పోకుండా మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది.

కుంభం

కుంభం : ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. పాతబాకీలు వసూలయినప్పటికీ, అందుకు తగిన ఖర్చు ఉండటంతో వచ్చిన డబ్బు పోతుంది. పెట్టుబడులకు, వ్యాపార లావాదేవీలకు అను కూలం కాదు. ఇంటికి సంబంధించి వస్తువు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల వల్ల డబ్బు ఖర్చయ్యే అవకాశముంది.

మీనం

మీనం : అనుకూలంగా ఉంటుంది. రుచి కరమైన ఆహారం లభిస్తుంది. మిత్రులు, బంధువులతో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు. అనుకున్న పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా అనుకూలిస్తుంది. అనుకోని ధనలాభం కలుగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios