Asianet News TeluguAsianet News Telugu

ఏప్రిల్ 10, 2018 మంగళవారం మీ రాశిఫలాలు

అనుకోని బహుమతి, ప్రశంస కానీ పొందుతారు.
today april10th your horoscope

మేషం

మేషం : చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.కొత్తగా ఏదైనా పని ప్రారంభించడానికి అనువైన రోజు. గృహానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. అనుకోని బహుమతి, ప్రశంస కానీ పొందుతారు. ఉద్యోగం మార్పు విషయంలో మీరు ఎదురుచూస్తున్న ఫలితం దక్కుతుంది.

వృషభం

వృషభం : మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. రోజువారి పనుల నుంచి విశ్రాంతి కోరుకుంటారు. ఏదైనా దూర ప్రదేశానికి, ఆధ్యాత్మిక కేంద్రానికి కానీ వెళ్లి ప్రశాంతంగా గడపాలనే ఆలోచన ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలం కాదు. ప్రయాణాల్లో కొంత ఇబ్బందికి లోనవుతారు.

మిథునం

మిథునం : ఒక సంఘటన మీ మనసు చెదిరిపోయేలా చేస్తుంది. అనవసర వివాదం , ఆర్థిక నష్టం కానీ జరిగే అవకాశముంటుంది. ముఖ్యంగా ఆవేశానికి లోను కాకుండా మీ పనులు చేసుకోవడం మంచిది. మాట విషయంలో జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు అంతగా అనువైన రోజు కాదు.

కర్కాటకం

కర్కాటకం : మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామికి కానీ, మీరు ప్రేమించిన వ్యక్తికి కానీ మీ ప్రేమను వ్యక్తపరుస్తారు. వివాహ సంబంధాల విషయంలో అనుకూలం. వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి. ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. ప్రయాణాలకు అనుకూలం.

సింహం

సింహం : ఆర్థికంగా బాగుటుంది. రావలసిన బకాయిలు వసూలవుతాయి. వివాదాల్లో కానీ, కోర్టు కేసుల్లో కానీ విజయం సాధిస్తారు. ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. అలాగే స్నేహితుల నుంచి అనుకోని సాయం అందుతుంది. ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి అనుకూల ఫలితం ఉంటుంది.

కన్య

కన్య : ఇష్టపడిన వారికి మీ ప్రేమను వ్యక్తం చేయడానికి, స్నేహితులతో వివాదాలు తొలగించుకోవడానికి అనుకూలం. మిత్రుల నుంచి సాయం ఆశిస్తున్నవారికి అనుకూల ఫలితం ఉంటుంది. మీ పిల్లలకు సంబంధించి ఉన్నత విద్యావకాశాలు మెరుగవుతాయి. సంతానం గురించి ఎదురుచూస్తున్నవారికి అనుకూల ఫలితం దక్కుతుంది.

తుల

తుల : పని మీద ఎక్కువగా ధ్యాస ఉండదు. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి, కుటుంబ సభ్యులతో గడపాలి అనే ఆలోచన ఉంటుంది. విద్యా, భూ, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలం. భూమి లేదా వాహనం కొనుగోలు చేసుకోవచ్చు. మీ తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

వృశ్చికం

వృశ్చికం : వ్యాపార వ్యవహారాలు, ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలం. ప్రయాణం చేసే అవకాశం ఉంది. విదేశం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవటం మంచిది. ఉద్యోగంలో మార్పుకానీ, ట్రాన్స్‌ఫర్ కానీ ఉంటుంది.

ధనుస్సు :

ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా కాకపోవడంతో కొంత నిరాశకు లోనవుతారు. ఇతరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్త అవసరం, లేనిచో అవమానాల పాలవుతారు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనటం, బాగు చేయించటం కానీ చేస్తారు. ఖర్చు అదుపులో ఉండదు.

మకరం

మకరం : ఆనందంగా గడుపుతారు. రుచికరమైన ఆహారం, మిత్రులతో లేదా కుటుంబ సభ్యులతో విహారం చేస్తారు. దుస్తులు కానీ, మీకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి సినిమా లేదా వినోద కార్యక్రమానికి హాజరవుతారు. అలవాట్లను అదుపులో ఉంచుకోవటం మంచిది.

కుంభం

కుంభం : కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్న పనికి అయినా ఇతరులపై ఆధారపడటం కానీ, ఇతరుల సాయం తీసుకోవడం కానీ చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్యతో ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది.

మీనం

మీనం : ఈ రోజు ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు అనుకూలం. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు గడిస్తారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు అలాగే కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.

Follow Us:
Download App:
  • android
  • ios