Asianet News TeluguAsianet News Telugu

ఏప్రిల్ 04, 2018 బుధవారం మీ రాశిఫలాలు

మానసికంగా ఉల్లాసంగా ఉంటారు
today april 4th your horoscope

మేషం

మేషం: ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. చీటికి మాటికి చిరాకు ఎక్కువవుతుంటుంది. తలపెట్టిన ప్రయాణం ఆగిపోవటం కానీ, వాయిదా పడ టం కానీ జరుగవచ్చు. ఉద్యోగ విషయంలో పై ఆధికారులనుంచి అవమానాలు ఎదురయ్యే అవకాశముంటుంది.

వృషభం

వృషభం : మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవితభాగస్వామి కొరకు లేదా కుటుంబ సభ్యుల కొర కు డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. చర్చలకు, కమ్యూనికేషన్‌కు అనుకూల దినం. మిత్రులను, బంధువులను కలుస్తారు. వినోద కార్యక్రమాల్లో మునిగి తేలుతారు.

మిథునం

మిథునం : ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. గృహసంబంధ వ్యవహారాలలో బిజీగా గడుపుతారు. మీ తల్లిగారి తరఫుబంధువులను కలుసుకోవటం జరుగుతుంది. మీ గృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులు కానీ, వివాదాలు కానీ పరిష్కరించబడతాయి.

కర్కాటకం

కర్కాటకం : ఆరోగ్య, ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. దూర ప్రయాణం కానీ, ఉద్యోగంలో మార్పుకానీ ఉంటుంది. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు. దైవ దర్శనం చేసుకోవటం కానీ, ఆధ్యాత్మిక క్షేత్రాల్ని సందర్శించటం కానీ చేస్తారు. నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది.

సింహం

సింహం :పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటి విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. ప్రశాంత చిత్తంతో అన్ని పనులు చేయగలుగుతారు.

కన్య

కన్య:ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ వృత్తిపరంగా మం చి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా బదిలీ కొరకు ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్య సమాచారం అం దుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికం గా ఉత్సాహంగా ఉంటారు. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.

తుల

తుల : మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయటానికి బద్ధకిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది.

వృశ్చికం

వృశ్చికం : ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు.

ధనుస్సు :

ధనుస్సు : బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణం గా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా ఇబ్బంది పడే అవకాశముంటుంది.

మకరం

మకరం : మీరు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోద కార్యక్రమాల్లో మునిగి తేలుతారు.

కుంభం

కుంభం : ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. ప్రారంభం చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆటంకాలు తొలగి పోతాయి. ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది.

మీనం


మీనం :ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తుల కారణంగా లేదా నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శత్రువులమీద ఒక కన్నేసి ఉంచండి. వారి కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశముంటుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.

 

Follow Us:
Download App:
  • android
  • ios