Asianet News TeluguAsianet News Telugu

26 ఏప్రిల్ 2018 గురువారం మీ రాశిఫలాలు

అనుకోని ధనలాభం కలుగుతుంది.

today april 26th your horoscore

మేషం

మేషం : మీ పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారికి సంబంధించిన పనులు పూర్తి చేయగలుగుతారు. అలాగే మీ ప్రేమను మీరు ప్రేమించిన వ్యక్తికి చెప్పడానికి అనుకూల దినం. మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ, తెలియని చిన్న ఆందోళన మనస్సులో ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి.

వృషభం

వృషభం : ఈ రోజు మీ ఇంటికి సంబంధించిన పనులు చేయడానికి, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మానసికంగా కొంత ఆందోళన కానీ, పరాకుగా కానీ ఉండటం జరుగుతుంది. చదువు పట్ల కొంత నిరాసక్తత ఉంటుంది.

మిథునం

మిథునం : ఈ రోజు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. బంధువులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అత్యుత్సాహానికి పోకుండా మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. పాతబాకీలు వసూలయినప్పటికీ, అందుకు తగిన ఖర్చుపైన పడటంతో వచ్చిన డబ్బు పోతుంది. పెట్టుబడులకు, వ్యాపార లావాదేవీలకు అనువైన రోజు కాదు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు.

సింహం

సింహం : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. రుచి కరమైన ఆహారం లభిస్తుంది. మిత్రులు, బంధువులతో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు. అనుకున్న పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా అనుకూలిస్తుంది. అనుకోని ధనలాభం కలుగుతుంది.

కన్య

కన్య : ఈ రోజు కొంత బద్ధకంగా గడుపుతారు. ఏ పని చేయటానికి ముందుకురారు. దాని కారణంగా కుటుంబ సభ్యుల కోపానికి గురవుతారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. మీ మిత్రులతో కానీ, దగ్గరి బంధువులతో కానీ వివాదం జరగడం లేదా వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం జరగవచ్చు.

తుల

తుల : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మిత్రుల నుంచి అనుకోని సాయం అందుకుంటారు. మీ స్నేహం బలపడుతుం ది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకోని శుభపరిణామా లు ఏర్పడతాయి. పెట్టుబడులు లాభిస్తాయి.

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూల సమయం. పై అధికారులను కలవటానికి అలాగే ముఖ్యమైన ఒప్పందాలకు కూడా అనుకూలించే దినం. అనుకోని బహుమతులు కానీ, ప్రశంసలు కానీ పొందుతారు. మీ మిత్రులు లేదా బంధువుల సహాయం అందుకుంటారు.

ధనుస్సు

ధనుస్సు : ఈ రోజు రోజువారీ పనులనుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు. గురువులను లేదా ఆధ్యాత్మిక వేత్తలను కలుస్తారు. ప్రయాణంలో అడ్డంకుల కారణంగా విసుగుకు లోనవుతారు. ఇంట్లోకి కొత్తవస్తువులు కొనడం కానీ, ఇల్లు సర్దడం కానీ చేస్తారు.

మకరం

మకరం : మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. ఒక సంఘటన కారణంగా మీ మనసు చెదురుతుంది. ఆర్థిక నష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళన మొదలైన భయం ఈ రోజు సూచించబడ్డాయి. మీ ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. శివున్ని పూజించండి.

కుంభం

కుంభం : ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవటానికి, ఒప్పందాలను, అంగీకారాలను కుదుర్చుకోవడానికి అనుకూల దినం. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. మీ ప్రేమను, ఆప్యాయతను వ్యక్తం చేయడానికి అనువైన దినం. పిల్లల ఆరోగ్య విషయం లేదా విద్యా విషయంలో ఆందోళన చెందుతారు.

మీనం

మీనం : ఈ రోజు వివాదాలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా భూ సంబంధ వివాదాలు పరిష్కరించుకోవడానికి అనుకూల దినం. మీ మాట నెగ్గుతుంది. అనుకూల ఫలితం పొందుతారు. ఆర్థిక లాభాలుంటాయి. జీవిత భాగస్వామి అనారోగ్యం కొంత ఆందోళనకు కారణమవుతుంది. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లు చేస్తారు. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి.

Follow Us:
Download App:
  • android
  • ios