Asianet News TeluguAsianet News Telugu

4 జూన్ 2018 సోమవారం మీ రాశిఫలాలు

అనుకోని బహుమతి, ప్రశంసను కానీ పొందుతారు.

today 4th june your horoscope

మేషం

మేషం : చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే కొత్తగా ఏదైనా పని ప్రారంభించడానికి అనుకూలం. గృహానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అనుకోని బహుమతి, ప్రశంసను కానీ పొందుతారు.

వృషభం

వృషభం : మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. రోజువారీ పనులనుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఏదైనా దూర ప్రదేశానికి, ఆధ్యాత్మిక కేంద్రానికి కానీ వెళ్లి ప్రశాంతంగా గడపాలి అన్న ఆలోచనను కలిగి ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలం కాదు.

మిథునం

మిథునం : ఒక సంఘటన మీ మనస్సు చెదిరిపోయేలా చేస్తుంది. అనవసర వివాదం కానీ, ఆర్థిక నష్టం కానీ జరిగే అవకాశముంటుంది. ముఖ్యంగా ఆవేశానికి లోను కాకుండా మీ పనులు చేసుకోవడం మంచిది. మాట విషయంలో జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు అంతగా అనుకూలం కాదు.

కర్కాటకం

కర్కాటకం : మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామికి కానీ, మీరు ప్రేమించిన వ్యక్తిని కానీ మీ ప్రేమను వ్యక్తపరుస్తారు. అలాగే వివాహ సంబంధాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి. ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

సింహం

సింహం : ఈ రోజు ఆర్థికంగా బాగుటుంది. రావలసిన బకాయిలు వసూలవుతాయి. వివాదాల్లో కానీ, కోర్టు కేసుల్లో కానీ విజయం సాధిస్తారు. ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. అలాగే స్నేహితుల నుంచి అనుకోని సాయం అందుతుంది. లోన్ కోసం లేదా ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ రోజు అనుకూల ఫలితం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.

కన్య

కన్య : ఇష్టపడిన వారికి మీ ప్రేమను వ్యక్తం చేయడానికి, స్నేహితులతో ఉన్న వివాదాలను తొలగించుకోవడానికి అనుకూల దినం. అలాగే మిత్రుల నుంచి సహాయం ఆశిస్తున్నవారికి వారు అనుకున్న సాయం అందుతుంది. మీ పిల్లలకు సంబంధించి ఉన్నత విద్యావకాశాలు మెరుగవుతాయి.

తుల

తుల : పని మీద ఎక్కువగా ధ్యాస ఉండదు. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి, కుటుంబ సభ్యులతో గడపాలి అనే ఆలోచన ఉంటుంది. విద్యా సంబంధ వ్యవహారాలకు, భూ, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలం. భూమి లేదా వాహనం కొనుగోలు చేయదలచిన వారు ఈ రోజు తీసుకోవచ్చు.

వృశ్చికం

వృశ్చికం : వ్యాపార వ్యవహారాలకు, ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలం. ప్రయాణం చేసే అవకాశం ఉంది. అలాగే విదేశం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం మంచిది.

ధనుస్సు

ధనుస్సు : ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా కాకపోయే సరికి కొంత నిరాశకు లోనవుతారు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం, లేకుంటే అవమానాల పాలవుతారు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనటం కాని, బాగు చేయించటం కానీ చేస్తారు.

మకరం

మకరం : ఆనందంగా గడుపుతారు. రుచికరమైన ఆహారం, మిత్రులతో లేదా కుటుంబ సభ్యులతో విహారం చేస్తారు. దుస్తులు కానీ, మీకు సంబంధించిన వస్తువులు కానీ కొనుగోలు చేస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి సినిమా లేదా ఇతర వినోద కార్యక్రమానికి హాజరవుతారు.

కుంభం

కుంభం : ఈ రోజు కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్న పనికి అయినా ఇతరులపై ఆధారపడటం కానీ, ఇతరుల సాయం తీసుకోవటం కానీ చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది. 

మీనం

మీనం : ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు గడిస్తారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు అలాగే కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడుతాయి. ప్రేమ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.

Follow Us:
Download App:
  • android
  • ios