Asianet News TeluguAsianet News Telugu

19 జూన్ 2018 మంగళవారం మీ రాశిఫలాలు

ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. 

today 19th june your horoscope

మేషం

మేషం : ఆర్థికంగా బాగుంటుంది. రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. వివాదాల్లో కానీ, కోర్టు కేసుల్లో కానీ విజయం సాధిస్తారు. ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. అలాగే స్నేహితుల నుంచి అనుకోని సాయం అందుతుంది. లోన్ కోసం లేదా ఆర్థిక సాయం కోరకు ఎదురుచూస్తున్న వారికి అనుకూల ఫలితం ఉంటుంది.

వృషభం

వృషభం : ఈ రోజు మీరు ఇష్టపడిన వారికి మీ ప్రేమను వ్యక్తం చేయటానికి, స్నేహితులతో ఉన్న వివాదాలను తొలగించుకోవటానికి అనుకూల దినం. మిత్రుల నుంచి సహాయం ఆశిస్తున్న వారికి వారు అనుకున్న సాయం అందుతుంది. పిల్లలకు సంబంధించి ఉన్నత విద్యావకాశాలు మెరుగవుతాయి.

మిథునం

మిథునం : ఈ రోజు పని మీద ఎక్కువగా ధ్యాస ఉండదు. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి, కుటుంబసభ్యులతో గడపాలి అనే ఆలోచన అధికంగా ఉంటుంది. విద్యా సంబంధ వ్యవహారాలకు, భూ, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం. భూమి లేదా వాహనం కొనుగోలు చేయదలచిన వారు ఈ రోజు తీసుకోవచ్చు. మీ తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు వ్యాపార వ్యవహారాలకు, ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం చేసే అవకాశం ఉంది. అలాగే విదేశం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవటం మంచిది. ఉద్యోగంలో మార్పు కానీ, ట్రాన్స్‌ఫర్ కానీ ఉంటుంది.
 

సింహం

సింహం : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా కాకపోయే సరికి కొంత నిరాశకు లోనవుతారు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం, లేనిచో అవమానాల పాలవుతారు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనటం కాని, బాగు చేయించటం కానీ చేస్తారు.

కన్య

కన్య : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవటం కానీ, నూతన వస్ర్తాలు కొనుగోలు చేయడం కానీ చేస్తారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉండడం మంచిది. జీవిత భాగస్వామి నుంచి అనుకోని సహాయం లభిస్తుంది.

తుల

తుల : కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్న పనికి అయినా ఇతరులపై ఆధారపడడం కానీ, ఇతరుల సాయం తీసుకోవటం కానీ చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది.

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు గడిస్తారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు అలాగే కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి.

ధనుస్సు

ధనుస్సు :మీరు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో అనుకూల మార్పు ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి అనుకోని బహుమతి అందుకుంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ సంతానం కారణంగా మీరు ఆనందాన్ని, గుర్తింపును పొందుతారు.

మకరం

మకరం : మీరు రోజువారీ కార్యక్రమాల నుంచి విశ్రాంతిని కోరుకుంటారు. ఒకే రకమైన జీవన విధానంలో కొంత మార్పు సాధించాలన్న ఆలోచన కలిగి ఉంటారు. అనుకోని ప్రయాణం కానీ, కొత్త వ్యక్తులను కలుసుకోవటం కానీ జరుగుతుంది. మానసికంగా ఏదో తెలియని అలజడిని, వెలితిని కలిగి ఉంటారు.

కుంభం

కుంభం : మానసికంగా అశాంతితో ఉంటారు. అనుకోని అవమానం కానీ, భయం కానీ ఎదురవుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన రోజు కాదు. కుటుంబ సభ్యుల అనారోగ్యం కూడా మీ ఆందోళనకు కారణం అవొచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. అనుకోని విషయాలపై ఖర్చు చేయాల్సి వస్తుంది.

మీనం

మీనం : వివాహ సంబంధ వ్యవహారాలకు, ఒప్పందాలకు అనుకూల దినం. మీ మనసులోని భావాలను మీ జీవితభాగస్వామికి వ్యక్తం చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి సినిమా లేదా ఇతర వినోద కార్యక్రమాలకు వెళతారు. బంధువులతో లేదా మిత్రులతో ఉన్న గొడవలు సమసిపోతాయి.

Follow Us:
Download App:
  • android
  • ios