Asianet News TeluguAsianet News Telugu

14 మే 2018 సోమవారం మీ రాశిఫలాలు

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

today 14th may your horoscope

మేషం

మేషం : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవడం, నూతన వస్ర్తాలు కొనుగోలు చేయడం చేస్తారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉండటం మంచిది. మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సాయం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.

వృషభం

వృషభం : ఈ రోజు కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్న పనికి ఇతరులపై ఆధారపడటం, సాయం తీసుకోవడం చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. మిత్రులతో అభిపాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది. అనవసర ఖర్చులుంటాయి.

మిథునం

మిథునం : ఈ రోజు ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు గడిస్తారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. స్నేహితులతో లేదా తోబుట్టిన వారితో ఎక్కువ సమయం గడుపుతారు. కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి. పేమ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి.. పుకార్లను నమ్మకండి.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు మీరు కొనాలనుకున్న లేదా పొందాలనుకున్న వస్తువులు మీ చేతికి వస్తాయి. ఉద్యోగ విషయంలో అనుకోని విజయం కానీ, ప్రశంస పొందుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్న చిన్న అడ్డంకులు వచ్చి నా నిరుత్సాహపడకుండా పని చేస్తే విజయం సాధిస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహం

సింహం : ఈ రోజు మీరు రోజువారీ కార్యక్రమాల నుంచి విశ్రాంతి కోరుకుంటారు. అనుకోని ప్రయాణం, కొత్త వ్యక్తులను కలుసుకోవడం జరుగుతుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో కానీ మార్పు కోరుకుంటారు. మీ ప్రతిభకు, మీరు చేసిన పనికి కానీ ప్రశంసలు అందుకుంటారు.

కన్య

కన్య : ఈ రోజు మానసికంగా కొంత అశాంతితో ఉంటారు. అనుకోని అవమానం, భయం కానీ ఎదురవుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన రోజు కాదు. కుటుంబ సభ్యుల అనారోగ్యం కూడా మీ ఆందోళనకు కారణం కావొచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం.

తుల

తుల : వివాహ సంబంధ వ్యవహారాలకు, ఒప్పందాలకు అనుకూల దినం. మీ మనసులోని భావాలను మీ జీవితభాగస్వామికి వ్యక్తం చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి సినిమా లేదా ఇతర వినోద కార్యక్రమాలకు వెళతారు.

వృశ్చికం

వృశ్చికం : ఆర్థికంగా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రావలసిన పాత బకాయిలు రావడం కానీ, లోన్ రావడం జరుగుతుంది. ఉద్యోగం విషయంలో ఎదురు చూస్తున్న వారికి కొంత అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాపార విషయాలకు కొంత సామాన్యంగా ఉంటుంది.

ధనుస్సు

ధనుస్సు : ఈ రోజు ప్రేమను లేదా మీ అభిపాయాన్ని వ్యక్తపరచడానికి అనుకూలంగా ఉంటుంది. మానసికంగా కొంత ఆందోళన, ఉత్సాహం కలగలుపుగా ఉంటాయి. మీ సంతానం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు, ఆర్థిక లావాదేవీలకు అంతగా అనుకూలమైన రోజు కాదు.

మకరం

మకరం : ఈ రోజు గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలమైన రోజు. ఇల్లు కొనడం లేదా నిర్మాణ సంబంధ పనులు, ఒప్పందాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే వాహనం కొనుగోలు చేస్తారు. మిత్రుల, బంధువుల సాయం అందుకుంటారు. ఇంట్లో విశ్రాంతిగా ఉండటానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు.

కుంభం

కుంభం : ఈ రోజు మీ వృత్తికి సంబంధించిన ప్రయాణం, అనుకోని మార్పు ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు మంచి సమాచారం అందుకుంటారు. కొత్త బట్టలు కానీ, వస్తువులు కానీ కొనుగోలు చేస్తారు.

మీనం

మీనం : ఈ రోజు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రావలసిన డబ్బులు వచ్చినప్పటికీ, మళ్లీ ఖర్చు రూపంలో వెళ్లిపోతాయి. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఒప్పందాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం చేసే అవకాశముంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios