Asianet News TeluguAsianet News Telugu

టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ‘క్రయిమ్ సస్పెన్స్ థ్రిల్లర్’ రిలీజయింది

ఆంధ్రా టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైదరాబాద్ లో భూములెలాకొట్టేసేవాడో తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది. పోలీసుల్ని, కోర్టులను కూడా  బురిడీ కొట్టించేందుకు ఆయన ఆడిన నాటకాలు క్రయిమ్, సస్పెన్స్ ,ధ్రిల్లర్ లాగా ఉంటాయి. ఇలాటి భయంకరమయిన కేసులలో ఇరక్కుని హైదరాబాద్ లో అరెస్టయినా, తెలుగుదేశం అధినేత ఆయన్నింకా పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. నాయకత్వానికి , ఆయనకు ఎంత మంచి ఎమ్వోయు కుదిరిందో.

this is tdp mlc deepak reddys modus operandi for land grabbing in hyderabad

ఆంధ్రా టిడిపి ఎమ్మెల్సీ దీప క్ రెడ్డి హైదరాబాద్ లో భూములెలాకొట్టేసేవాడో తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది. పోలీసుల్ని, కోర్టులను కూడా  బురిడీ కొట్టించేందుకు ఆయన ఆడిన నాటకాలు క్రైం, సస్పెన్స్ ,ధ్రిల్లర్ లాగా ఉంటాయి. ఇలాటి భయంకరమయిన కేసులలో ఇరక్కుని హైదరాబాద్ లో అరెస్టయినా, తెలుగుదేశం అధినేత ఆయన్నింకా పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. నాయకత్వానికి , ఆయనకు ఎంత మంచి ఎమ్వోయు కుదిరిందో.

 

ఈ రోజు ‘టైమ్స్ ఆప్ ఇండియా’ వెల్లడించిన రెడ్డిగారి ఘరానా మోసం ఇది.

 

భూముల్ని కాజేసేందుకు, భూముల మీద హక్కులున్న ఆమాయకుల్ని తరిమేసేందుకు  మన దీపక్ రెడ్డి మనుషుల్ని ఏకంగా  సృష్టించేవాడు, వాళ్లని మాయం చేసేవాడు, వాళ్లని ఎవరయినా చంపారేమో అని అనుమానం అని  భూములన్నోళ్ల మీద కేసుపెట్టేవాడు. మధ్యలోనే వికటించకపోతే ఈ థ్రిల్లర్  పూర్తయ్యేది . అయితే, హైదరాబాద్ పోలీసులు అలర్టవడంతో  దీపక్ రెడ్డి కటకటల్లోకి వెళ్లాల్సి వచ్చింది. అయితే, ఇది వోటుకు నోటు కేసులా తయారవుతుందో లేక బాక్సాఫీస్ హిట్టవుతుందో చూడాలి.

 

హైదరాబాద్ పరిసరాలలో భోజగుట్ట అనే వూరుంది. అక్కడ ముస్తఫా హిల్స్ కోఆపరేటివ్ సొసైటీ అనే దొకటుంది. ఈసొసైటికి ఉన్న 78 ఎకరాల భూమి మీద దీపక్ రెడ్డి, ఆయన మిత్రుడు, అడ్వకేట్ అయిన శైలేష్ సక్సేనా కళ్లు పడ్డాయి. ఈ భూములు కాజేసేకుంభకోసం ఇక్బాల్ ఇస్లాం ఖాన్ అనే క్యారెక్టర్ ను సృష్టించారు. ఖాన్ అనే వాడు కనిపించడం లేదని, అతన్ని ఎవరైనా చంపేసే ప్రమాదం ఉందని, అదికూడా ముస్తఫా హిల్స్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ల మీద అనుమానంఉందని రెడ్డి, సక్సేనా కోర్టు కెళ్లారు. అయితే, హైదరాబాద్ పోలీసుల ఇదంతా  మాంచి కథ అని కనుకున్నారు. ఎంక్వయిరీ చేశారు. తీరా చూస్త ఇక్బాల్ ఇస్లామ్ ఖాన్ అనేవోడెవడూ లేడని, దీపక్ రెడ్డి సృష్టించిన పాత్ర అని కనిపెట్టేశారు.

 

గత నెలలో కోర్టు ఉత్తర్వుల మేరకు ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదు చేసుకున్నారు. ఇక్బాల్ కు, ముస్తాఫా హిల్స్ వారికి భూమి మీద వోనర్ షిప్ మీద గొడవలున్నాయని, అందువల్ల మాయమయిన ఇక్బాల్ ను వాళ్లే చంపేస్తారేమో నని  కేసు నమోదయింది. ఈ మిస్సింగ్ కేసు మీద సెంట్రల్ క్రయిమ్ స్టేషన్ దర్యాప్తు మొదలుపెట్టింది. ఇక్బాల్ ఖాన్ అనే వాడి పేరు మీద చాలా భూముల డాక్యుమెంట్లున్నాయని, వాటిని ఆధారం చేసుకుని అనేక భూవివాదలు నడిపిస్తున్నారని పోలీసులకు తెలిసింది.

 

హత్య పేరుతో ఇక్బాల్ ఖాన్ అనే వాడిని పూర్తిగామాయం చేసి ఆ నేరాన్ని ముస్తాఫా హిల్స్ మీద తోసేయాలన్నది కుట్ర. హత్య కేసుచూపిసక్సేనా  ఈ భూములను వెంటనే ఖాళీ చేయాలని ముస్తాఫా హిల్స్ సొసైటీ మీద వత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు. మరొక అసక్తి కరమయిన విషయమేమంటే, ఇక్బాల్ పేరుతో ఒక సారి కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి ఇక్బాల్ కాదు, అతని పేరు శివ భూషణం. ఇంకా బతికే ఉన్నాడు.

 

ఈ కేసుకు కొద్ది రోజుల ముందు తన వాచ్ మన్ మాయమయ్యాడని, ముస్తఫా హిల్స్ సొసైటీ వారే కిడ్నాప్ చేసి ఉంటారని దీపక్ రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రిలో కూడా కేసుపెట్టాడు. చివరకు ఇది కూడా బోగస్ కంప్లయింటని తెలిసింది.

 

ఈ కుంభకోణం లో మరొక భాగస్వామి, అడ్వకేట్ సక్సేనా తండ్రి ప్రకాశ్ సక్సేనా. వీందరికి దొంగ డాక్యుమెంట్సు పుట్టించి ఇచ్చేది శ్రీనివాస్ అనే డాక్యుమెంట్ రైటర్.

 

దీపక్ రెడ్డి ఆంధ్ర పెద్దల సభలో గౌరవ సభ్యుడంటే నమ్ముతారా?

Follow Us:
Download App:
  • android
  • ios