అమ్మాయిల విషయంలో అబ్బాయిల భయాలు ఇవే..

There are reasons why boys fear of  girls
Highlights

  • యుక్త వయసు దాటినప్పటి నుంచి వారిలో ఈ భయాలు మొదలౌతాయంటున్నారు

అబ్బాయిలు భయటకు చెప్పకుండా లోలోపల కొన్ని విషయాల్లో భయపడుతుంటారు. ముఖ్యంగా యుక్త వయసు దాటినప్పటి నుంచి వారిలో ఈ భయాలు మొదలౌతాయంటున్నారు నిపుణులు. మరి ఆ భయాలేంటో ఇప్పుడు చూద్దామా..

ఎప్పుడైతే యుక్త వయస్సులోకి వస్తారో ఆ సమయంలో తమకు గడ్డం వస్తుందా లేదా మరియు తాము ప్రపంచానికి పురుష లక్షణాలతో కనపడతామా లేదా అనే విషయమై రహస్యంగా ఆందోళన చెందుతూ ఉంటారు. ఆ తర్వాత అమ్మాయిలకు నేను నచ్చుతానా లేదా.. నేను ఎలా ఉంటే అమ్మాయిలను ఆకర్షించవచ్చు అనే విషయాలపై ఎక్కువగా ఆలోచిస్తారట.కొంత మంది పురుషులు తమ భార్యలు తమను మోసం చేస్తున్నారా అనే విషయమై ఆందోళన చెందుతూ ఉంటారు. ముఖ్యంగా 45 సంవత్సరాలు దాటినా పురుషులు ఎవరైతే పడక గదిలో తమ సామర్ధ్యాన్ని సహజంగానే కోల్పోతారో అలాంటి వారిలో ఈ రకమైన భయాలు ఎక్కువగా ఉంటాయి.

డబ్బు ఉంటేనే స్త్రీలు పురుషులను ప్రేమిస్తారు అని చాలా మంది పురుషులు ఒక భ్రమలో ఉంటారు. హోదా, డబ్బు మరియు ఐశ్వర్యం పురుషుడి యొక్క మొత్తం స్థితిని మరింత పెంచుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ, డబ్బు ఒక్కటే మంచి సంబంధ బాంధవ్యాలను తీసుకు వస్తుంది అనడంలో అర్ధం లేదు.కానీ, చాలామంది పురుషులకు తాము బాగా సంపాదించగలమా లేదా అనే విషయమై ఎక్కువగా భయపడుతూ ఉంటారు. మరి కొంతమంది పురుషులు అయితే తమ దగ్గర ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకుంటే ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనే విషయమై ఎక్కువగా అలోచించి ఆందోళన చెందుతూ ఉంటారు.

అనుభవం లేకపోతే తమకు నపుంసకత్వం ఉందని భావిస్తారా ? అనే విషయమై పురుషులు భయపడుతూ ఉంటారు. అటువంటి సమయంలో వారి యొక్క గతాన్ని గుర్తుచేసుకుంటూ వారికి ఉన్న వ్యవహారాల గురించి చెప్పడం మొదలు పెడతారు. ఇది ఒక అర్ధంలేని భయం అనే చెప్పాలి. కానీ, ఇలా చెప్పడం వల్ల తమను తాము మన్మదుడిగా ప్రపంచానికి చూపించడం ద్వారా మంచి ఆకర్షణీయమైన స్త్రీ తమను ఎక్కువగా ఇష్టపడే అవకాశాలు ఉన్నాయని పురుషుడు భావిస్తుంటాడు.

తమ భాగస్వామికి తెలిసిన వారిలో ఎవరైనా ఆకర్షణీయమైన పురుషులు గనుక ఉంటే వారిని పురుషుడు రహస్యంగా ద్వేషిస్తూ ఉంటాడు. కొంతమంది పురుషులు అయితే రహస్యంగా తమ ప్రియురాలి స్నేహితుల గురించి తెలుసుకోవడానికి ఫేస్ బుక్ లో వెతుకుతూ ఉంటారు. ఏ వ్యక్తి కూడా అంత ఆకర్షణీయంగా ఉండకూడదు అనే అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ఇలా చేస్తుంటారు.తమ భాగస్వామికి తెలిసిన వారిలో ఎవరైనా ఆకర్షణీయమైన పురుషులు గనుక ఉంటే వారిని పురుషుడు రహస్యంగా ద్వేషిస్తూ ఉంటాడు. కొంతమంది పురుషులు అయితే రహస్యంగా తమ ప్రియురాలి స్నేహితుల గురించి తెలుసుకోవడానికి ఫేస్ బుక్ లో వెతుకుతూ ఉంటారు. ఏ వ్యక్తి కూడా అంత ఆకర్షణీయంగా ఉండకూడదు అనే అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ఇలా చేస్తుంటారు.

loader