Asianet News TeluguAsianet News Telugu

ఇది గోరింట కథ

  • శ్రావణమాసానికి గోరింటకు అనుబంధం ఉంది
  • ఎన్నోరకాల చెట్లున్నా ఒక్క గోరింట మాత్రమే ఎందుకు పండుతోంది
  • ఈ గోరింట వెనక ఉన్నకథేంటో తెలుసా...
The story behind the mehandi

 

The story behind the mehandiశ్రావణమాసం వచ్చేస్తోంది.. ఈ శ్రావణ మాసంలో  వివాహాది శుభకార్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.  వివాహం అనగానే వధువరులతో పాటు బంధువులు, కుటుంబసభ్యులు కూడా అందంగా   ముస్తాబవుతుంటారు. ముఖ్యంగా మహిళలు వారి అర చే తులను గోరింటాకుతో అలంకరించుకుంటారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే.. మరి మహిళలు అసలు గోరింట ఎందుకు పెట్టుకోవాలి?  ఈ  భూ ప్రపంచంలో చాలా రకాల చెట్లు, మొక్కలు ఉన్నా.. ఒక్క గోరింట మాత్రమే ఎందుకు పండుతోంది. ? దీనికి సంబంధించి పురణాల్లో  ఓ కథే ఉంది. ఆకథేంటో మనమూ తెలుసుకుందామా..

రావణాసురుడిని సంహరించి.. రాముడు సీతమ్మ ను కాపాడి తన వెంట తీసుకొని వెళ్లేందుకు వచ్చినప్పుడు.. ఆమె ముఖం సంతోషంతో వెల్లివిరిసిందట. అప్పుడు సీతాదేవి రామునితో.. తాను లంకలో ఉన్నంత కాలం తన బాధలన్నిం టినీ గోరింట చెట్టుకు చెప్పుకున్నానని ... అందుకు గోరింటకు ఏదైనా చేయాలని కోరింది. ఇందులో భాగంగానే సీతమ్మ గోరింటాకు చెట్టును వరం కోరుకోమని అడిగింది. అందుకు గోరింట.. ప్రస్తుతం సీతమ్మ మోము ఎంత అందంగా, సంతోషంగా కళకళలాడుతోందో...లోకంలోని మహిళలందరూ ఉండాలని కోరుకుంది. గోరింట కోరికను మన్నించిన సీతాదేవి.. ఎవరైతే గోరింట చెట్టును పూజించి.. వారి అర చేతులకు దాని ఆకులను పెట్టుకుంటారో.. వారికి సకల సంతోషాలు కలగి ఉంటారని వరాన్ని ప్రసాదించింది. 

ఆకాలం నుంచి మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా మారింది.  దీని వలన వధూవరులకు.. పెళ్లికి వచ్చిన వారికి కూ డా మంచి జరుగుతుందని నమ్మకం. ఈ మధ్య కాలంలో గోరింటాకు నూరి పెట్టకునే వారి సంఖ్య తగ్గినా.. దానికి బదులు మెహందీ పేరిట  మార్కెట్ లో లభించే కోన్ లను పెట్టుకుంటున్నారు.  ఏది ఏమైనా ఈ సంప్రదాయాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios