ఉత్తరప్రదేశ్ లో దారుణం నడిరోడ్డుపై వృద్దురాలిపై దాడి

ఉత్తరప్రదేశ్‌ రాయ్ బరేలిలో ఘోరం జరిగింది. మానవత్వాన్ని మరిచిన ఓ వ్యక్తి వృద్ధురాలని కుడా చూడకుండా ఓ ముసలవ్వను తీవ్రంగా కొట్టాడు. ఆమెను రోడ్డుపైకి దురుసుగా తోసేసిన అతడు కింద పడ్డ వృద్దురాలిని కాలితో తంతూ అమానవీయంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటిస్తున్నప్పటికి లాక్కుంటూ ఎక్కడికో తీసుకెళ్లాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

అయితే ఆమెను చితకబాదుతుండగా రోడ్డుపై వెళ్తున్న ఏ ఒక్కరూ కూడా స్పందించలేదు. ముసలవ్వను ఆ వ్యక్తి చితకబాదుతున్నా.. చూసుకుంటూ వెళ్లిపోయారే తప్ప.. కనీసం ఆపే ప్రయత్నం చేయలేదు. అయితే వృద్దురాలిని వ్యక్తి కొడుతున్న వీడియో పోలీసులకు చిక్కింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

వీడియో

Scroll to load tweet…